Agony
-
కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె
అమ్మో నాకు చావు తప్పేట్టు లేదు. కాలికి కత్తి కట్టుకుని కదనరంగంలో నెత్తురోడుతూ దిక్కుమాలిన చావు నా నుదిటిన రాసిపెట్టినట్టుంది. వేకువజామునే అందరినీ మేలుకొలిపే నేను సంక్రాంతి మలిపొద్దు ఉంటానో.. ఉండనో..! న్యాయస్థానం ఆదేశాలు.. ఖాకీల హెచ్చరికలు ఇప్పటివరకూ కొండంత ధైర్యం నింపాయి.. ఖద్దరు నేతల ధీమా చూస్తే మాత్రం నా ప్రాణంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పోలీసోళ్లు బరులను ధ్వంసం చేస్తున్నా.. హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా.. పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పందేలకు అనుమతులొచ్చేస్తాయన్న ధీమా మా యజమాని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. హుషారుగా, కూనిరాగాలు తీస్తూ ఈల పాటలు వేసుకుంటూ నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ పందేలకు సిద్ధమైపోతున్నాడు నాకు చావు ఘడియలు సమీపించినట్టే అనిపిస్తోంది. కనీసం కత్తులు కట్టకుండా డింకీ పందేలు వేసినా.. ఓపికున్నంత సేపు కొట్టుకుని చావుదెబ్బలతోనైనా బయటపడేవాళ్లం. పందేలు సంప్రదాయమని, వీటిని ఎవరూ ఆపలేరని నేతలు మా ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. సంక్రాంతిపండగ అందరిలోనూ ఆనందం నింపుతుంటే నాకు మాత్రం కొన్నిరోజులుగా నిద్రాహారాలు లేవు. ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నా. జీడిపప్పులు, బాదం పిస్తాలు, వేటమాంసం కీమా ఉండలు. రాగులు, గంట్లు, గుడ్లు.. ఏంపెట్టినా నోటికి సహించడం లేదు. ఏదీ తినబుద్ధి కావడం లేదు. సంక్రాంతి వచ్చేసింది. హరిదాసు కీర్తనలు వినిపిస్తున్నాయి. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడుతున్నాయి. అందరూ ఆనందంగా ఊళ్లకు పయనమవుతున్నారు. అదిగో అప్పుడే భోగి పండగ వచ్చేసింది. ఆ మంటల వెచ్చదనం నా శరీరాన్ని తాకుతోంది. నా చావు ముహూర్తం దగ్గర పడుతుందన్న సంకేతం పంపుతోంది. నా కోజ మాంసం బిర్యానీలో కలిసిపోవాల్సిందేనేమో..! ఇంతకాలం ఎంతో డాబు, దర్పంతో మహారాజులా బతికాను. ఇంత బతుకూ పందేల్లో చావుకే అన్నట్టు ఉంది. ఇంతకాలం నా యజమాని బలవర్ధక ఆహారం పెడుతుంటే.. కుటుంబ సభ్యులనూ పట్టించుకోకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటే ఆయనకు నాపై ఎంత ప్రేమ అని పొంగిపోయాను. రోజూ తిన్నంత తిండి, తిన్నది అరగడానికి మందులు.. కాలక్షేపానికి జీడి పిక్కలు.. బోరుగా ఉంటే బాదం పిస్తాలు... బ్రేక్‌ఫాస్ట్‌గా వేట మాంసం కీమా ఉండలు.. గుడ్లు, పాలు.. రాగులు, సజ్జలు.... ఇవన్నీ తినేసినా... కొవ్వు పెరగకుండా రోజూ వ్యాయామాలు.. కాస్త దగ్గినా, తుమ్మినా క్షణాల్లో వాలిపోయే వైద్యులు.. ఇప్పుడర్థమవుతోంది ఆ రాజభోగమంతా సంక్రాంతి పందేల్లో చచ్చేందుకేనని.. ఇంతకాలం నా యజమాని దేవుడనుకున్నాను. ఇప్పుడు నా పాలిట యముడిలా మారాడు. ఒకవేళ నా అదృష్టం బాగుండి పందేలు గెలిచి బతికినా ఒళ్లంతా గాయాలతో, జీవచ్ఛవంలా మారాల్సిందే. ఏదేమైనా నా యజమాని రుణం తీర్చుకునేందుకు ఇది మంచి అవకాశం. విజయమో వీరస్వర్గమో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కనీసం ఒక పందెం అయిగా గెలిచి అతనికి బహుమతిగా ఇవ్వాలన్నదే నా ఆశయం. పైకి ఇన్ని డాంబికాలు పోతున్నా.. లోలోపల ఏదో తెలీని ప్రాణభీతి నన్ను కుంగదీస్తోంది. ప్రాణాలంటే ఎవరికి తీపి కాదు. అదిగో నా యజమాని ఫోన్లో మాట్లాడుతున్నాడు. పందేలు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నాడు. ఇంకా కాసేపట్లో నా బతుకేంటో తేలిపోతుంది. ఓరి భగవంతుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే కోడిజాతిలో పుట్టించకు. ఒకవేళ పుట్టించినా. పందెం కోడిగా మాత్రం పుట్టించకు. ఒక వేళ పుట్టించినా.. పండగ మాటున మూగజీవాల ఉసురు తీసుకునే విష సంస్కృతి ఉన్న సమాజంలో మాత్రం పుట్టించకు.. ఇదే నా వేడుకోలు.. వినవలె.. – ఇట్లు మీ పందెం కోడి(–గణపవరం) -
అమితాబ్ బచ్చన్ బాధ ప్రపంచం బాధ
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వంగా తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సాహిత్యంపై తనకు సంక్రమించిన హక్కులు 2063 తర్వాత పబ్లిక్ డొమేన్ (ప్రజల పరిధి)లోకి వెళ్లిపోతాయంటూ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ 2003లో చనిపోయారు. దాంతో వారసత్వంగా ఆయన రాసిన నవలలు, కవితలు, వ్యాసాలపై 2063 వరకు అమితాబ్‌కు సర్వ హక్కులు లభించాయి. 1957 నాటి కాపీరైట్ హక్కుల చట్టం ప్రకారం సాహిత్యం, సంగీతం, కళలు, నాటకాలు, సినిమాలపై ఎవరికైనా 60 ఏళ్ల వరకే కాపీ రైటు ఉంటుంది. ఇంకా అమితాబ్‌కు తాను జీవించినంత కాలం కాపీరైటు హక్కులు ఉంటాయి. అయినా తన వారసులుగా ఆ హక్కులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉంది. అందుకే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే సినిమాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పవచ్చు. ఓ సినిమా తీసి 60 ఏళ్లయితే ఎవరికీ ఆ సినిమాపైనా హక్కులు ఉండవు. ఆ సినిమా ప్రజల పరిధిలోకి వెళుతుంది. అప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలనుగానీ, మాటలనుగానీ, మొత్తంగా కథనుగానీ ఎవరైనా ఉచితంగా కాపీ చేసుకోవచ్చు. ఎవరికి రాయల్టీ కింద అణా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన బాలీవుడ్ హిందీ చిత్రాలనే పరిగణలోకి తీసుకున్నట్లయితే 1958 సంవత్సరానికి ముందు తీసిన అన్ని సినిమాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయన్న మాట. 1941లో కమల్ అమ్రోహి తీసిన ‘మహల్’, 1951లో రాజ్‌కపూర్ తీసిన ‘ఆవారా’, 1957లో రాజ్‌కపూరే తీసిన ‘శారద’, 1958లో మెహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా లాంటి చిత్రాలు, 1955లో తెలుగులో ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’, 1951లో బీఎన్ రెడ్డి తీసిన ‘మళ్లీశ్వరి’, 1951లో కేవీ రెడ్డి తీసిన ‘పాతాళభైరవి’, 1957లో కేవీ రెడ్డి తీసిన ‘మాయాబజార్’ లాంటి ఆణిముత్యాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయి. ఈ సినిమాలను రీమేక్ చేయడానికి, ఈ సినిమాల్లోని సన్నివేశాలను వాడుకునేందుకు చట్ట ప్రకారం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట. ఇలా కాపీ రైటు హక్కు భారత్‌లో 60 ఏళ్లు ఉండగా, అమెరికాలో 70 ఏళ్లు ఉంది. ఈ కారణంగా అమెరికాలో ఫ్రాంక్ కాప్ర, ఆర్సన్ వెల్లెస్, ఫ్రిడ్జ్ లాంగ్ చిత్రాలు పబ్లిక్ డొమేన్లోకి వచ్చాయి. సినిమా హాళ్లు, టీవీలే కాకుండా ఇంటర్నెట్, వెబ్సైట్లు లాంటి పలు రకాల ప్రసార మాధ్యమాలు వచ్చినందున 60 ఏళ్లు, 70 ఏళ్లు అంటూ కాపీరైటు ఉండరాదని సినిమా వర్గాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం నడవక నష్టం వచ్చిన సినిమాకు నేడు మారిన మాధ్యంలో ఆదరణ లభించవచ్చు, డబ్బులూ రావచ్చని నిర్మాతలు అంటున్నారు. సాహిత్యంలోగానీ, కళల్లోగానీ వారసత్వంగా సంక్రమించే హక్కులు శాశ్వతంగా ఉండాలని ఆయా రంగాల వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తకొత్త మాధ్యమాలు మారుమోగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే చట్టం మారనూ వచ్చు! -
బై..బై నాన్నా!
అది తప్పు కాదు... కానీ, దాని వల్ల గొప్ప నష్టం వచ్చింది. తండ్రీ కొడుకుల మధ్య పెద్ద అగాధమే మిగిలింది. మళ్లీ వీళ్లిద్దరూ ఎలా కలవాలి?! ప్రేమలో తప్పు ఒప్పులుండవని ఎలా చెప్పుకోవాలి? ప్రేమగా ఎలా కౌగిలించుకోవాలి? సంతోషంగా ఎలా ‘బై’ చెప్పుకోవాలి? ఏదో చప్పుడవడంతో మెలకువ వచ్చింది బాలకు. కరెంట్ పోయినట్టుగా ఉంది అంతా చీకటి. పక్కన చేత్తో తడిమి చూసింది భర్త లేడు. గాబరాగా అనిపించి పిలిచింది. పలుకు లేదు. ‘బాత్రూమ్కి వెళ్లుంటాడా..’ అనుకుంది. ‘ఇంత చీకట్లో బాత్రూమ్లో పడిపోతే.. ఇంకేమైనా ఉందా!’ ఆమె గాబరా ఇంకా పెరిగింది. టార్చ్ వేసి కనిపించినమేర చూసింది. బాత్రూమ్ డోర్ వేసే ఉంది. ఎక్కడా భర్త జాడలేదు! ‘ముసలాయన ఈ టైమ్‌లో ఎక్కడకెళ్లినట్టు..’ గొణుక్కుంటూనే బాల్కనీ వైపు చూసింది. చైర్లో కూర్చొని కనిపించాడు. ‘హమ్మయ్య..’ అనుకుంది. పిలిచింది.. పలకలేదు. అతని దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసి..‘‘పడుకోక ఇక్కడెందుక్కూర్చున్నారు అర్ధరాత్రప్పుడు?’’ అంది. ‘‘మనబ్బాయి కల్లోకి వచ్చాడే. నా దగ్గరకు వస్తూ వస్తూనే అంతలోనే కనపడకుండాపోయాడు...’’ అతని గొంతులో దుఃఖం తాలూకు వణుకు వినిపిస్తోంది. ‘‘ఎన్నేళ్లని ఇలా బాధపడుతూనే ఉంటారు? రండి వచ్చి పడుకోండి...’’ ‘‘ఎందుకెళ్లిపోయాడే..! తండ్రిని ఒక్కమాట అనకూడదా?! వాడు నన్ను క్షమిస్తాడంటావా!’’ ... భార్య భుజం ఆసరా చేసుకొని లేచి, రెండడుగులు వేశాడు. గుండెలో కలుక్కుమన్నట్టుంది. పట్టు తప్పింది. భర్త పడిపోవడంతో బాలకు గుండాగినంతపనైంది. పండగ కళ దూరమైన వేళ ‘‘చూడమ్మా! ఈ వయసులో గుండెపోటు రావడం ఇది రెండవసారి. జాగ్రత్త...’’ బాలతో చెప్పాడు డాక్టర్. తలూపింది బాల. రాత్రి ఈ డాక్టర్‌కే ఫోన్ చేస్తే, అంబులెన్స్ పంపించారు. ఇప్పటికి గండం గట్టెక్కినట్టే. కానీ, భర్త ముఖంవైపే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది. ‘ఎంత అందమైన జీవితం తమది.. కూతురు, కొడుకుతో ఇల్లు పండగలా ఉండేది. ఆయుర్వేద డాక్టర్ గా అనిరుధ్‌కి మంచి పేరు. కూతురుకు అనువైన సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఆదిత్యకు సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడే హాస్టల్లో ఉండేవాడు. ఆ రోజు పుట్టిన రోజు అవడంతో హాస్టల్ నుంచి ముందే వచ్చాడు. ఉదయాన్నే ముగ్గురం గుడికి వెళ్లొచ్చాం. వాడికిష్టమైన వంటకాలన్నీ చేశాను. ఫ్రెండ్స్‌ను కలవడానికి బైక్ తీసుకెళతానన్నాడు. వద్దని వారించాడు తండ్రి. మొండికేశాడు వీడు. కొడుకుని తిట్టి, బండి కీస్ తీసుకొని క్లినిక్‌కి వెళ్లిపోయాడు అనిరుధ్. దీంతో వీడు కోపంగా ‘ఈయన ఎప్పుడూ ఇంతే, నేనీ ఇంట్లోనే ఉండను’ అంటూ హాస్టల్‌కి వెళ్లిపోయాడు. ఆరని చిచ్చు! సాయంకాలానికి ఆదిత్య హాస్టల్ నుంచి ఫోన్. రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందనీ, ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించామని. గుండెలు బాదుకొని ఆసుపత్రికెళ్లాం. పుట్టినరోజునాడే శవమై కనిపించాడు ఆదిత్య. కంటికిమింటికీ ఏడ్చాం. ‘అడిగినప్పుడు బండి ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో..’ అని కుమిలిపోయాడు అనిరుధ్. ఈ సంఘటన జరిగి నిన్నటికి పదేళ్లు. ఈ వయసులో మాకు అండగా ఉండాల్సినవాడు..’ భర్త పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంది బాల. సోల్ ఆస్ట్రల్ ట్రావెల్ ‘‘మీరు మీ కొడుకును కలుసుకోవచ్చు. మాట్లాడవచ్చు. మాట్లాడతారా?’’ చిరునవ్వుతో అడిగిన కౌన్సెలర్ మాటలకు అవునన్నట్టు తలూపాడు అనిరుధ్. తనలో ఏళ్లుగా గూడుకట్టుకున్న విషాదాన్ని తొలగించుకోవడానికి థెరపిస్ట్‌ను కలిశాడు. మరణించినవారి జ్ఞాపకాలతో వేదనాపూరితమైన జీవితం గడిపేవారు ఎలా ఆ బాధ నుంచి విముక్తి పొందాలో, దానికి తగిన చికిత్స ఎక్కడ ఉందో ఈ మధ్యే తెలిసింది అనిరుధ్‌కి. ధ్యానప్రక్రియలో దీన్ని ‘ఛానలింగ్ స్పిరిట్స్’ అంటారని, ఇది వేల ఏళ్లుగా లోకంలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు చూపించిన వేదిక మీద విశ్రాంతిగా పడుకున్నాడు. అందని తీరాలు అందిన వేళ ఐదు.. పది.. నిమిషాలు గడుస్తున్నాయి. మెల్లగా తానేదో కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు అనిపిస్తోంది అనిరుధ్‌కి. తను చేసే ఆ ప్రయాణం.. ఎప్పుడూ చూడనంత అందంగా ఉంది. కాసేపటికి.. ‘‘ఓ అద్భుతమైన కాంతిగోళం కనిపిస్తోంది’’ చెప్పడం మొదలుపెట్టాడు అనిరుధ్. ‘‘వెండిలా మెరిసే లోకమేదో వింతగా ఉంది. మధురంగా నీటి గలల శబ్దాలు వినిపిస్తున్నాయి. అదో అందమైన సరస్సు. ఆ సెలయేటిలో పడవను నడుపుకుంటూ వస్తున్నాడో యువకుడు. సన్నని రాగమేదో తీస్తున్నాడు. అతడిని తేరిపార చూశాను. వాడు.. వాడు... నా కొడుకు ఆదిత్య. అవును వాడే.. ! అయ్యో, నన్ను చూసి కూడా వెళ్లిపోతున్నాడు. పలకరించడమే లేదు. నన్ను వాడెప్పటికీ క్షమించడు...’ ఆదిత్య పలవరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. వీడ్కోలుతో విశ్రాంతి... ‘‘ఆందోళన వద్దు.. అతనితో మాట్లాడండి..’’ కౌన్సెలర్ ఇచ్చే సూచనలు అందుతున్నాయి అతనికి. కాసేపటికి.. ‘‘ఆ.. ఆదిత్య నాకు దగ్గరిగా వస్తున్నాడు. బాగా దగ్గరగా వచ్చాడు..‘బాగున్నావా?!’ అడుగుతూ వాడినే చూస్తున్నాను. వాడి మొహంలో ఎంతో ప్రశాంతత. ఆ కళ్లలో ఎంతో ప్రేమ.. ‘‘నన్ను ఎందుకు వదిలేసిపోయావు?’’ దిగులుగా అన్నాను. చల్లగా నవ్వుతున్నాడు. రెండు చేతులూ సాచాడు దగ్గరగా రమ్మని. మాటలే లేవన్నంత ఆనందం నాలో. అంతే ఆర్తిగా వెళ్లాను. ఆదిత్య ను హత్తుకుపోయాను. అప్పటివరకూ ఉన్న నా బాధ కరిగి నీరవుతుంది. అలా ఎంత సేపు గడిచిందో... మెల్లగా అతని తెల్లని చెయ్యి వీడ్కోలు చెబుతున్నట్టు పైకి లేచింది. ఆ క్షణంలో నాకు అర్థమైంది. అతను ఇక్కడ నా కొడుకు కాదు. నేను అతని తండ్రిని కాదు. నా కారణంగా అతని మరణం సంభవించలేదు. అసలు చేతనత్వానికి మరణమే లేదు. ఆ దివ్యరూపం వెళ్లిపోతున్నందుకు నాకేవిధమైన బాధా కలగడంలేదు. బదులుగా నేనూ చెయ్యి ఊపుతూ ‘ైబె ఫ్రెండ్..’ అన్నాను. అతని రూపం మెల్లగా కనుమరుగయ్యింది.’ అనిరుధ్ మెల్లగా కళ్లు తెరిచాడు. అప్పటి వరకు ఉన్న బరువేదో దిగిపోయినట్టు మనసంతా దూదిపింజలా తేలికైనట్టు అనిపించింది. ప్రేమను పంచు ఉదయపు నీరెండలో కుర్చీలో ఒదిగి కూర్చున్న బాల వద్దకు కాఫీ కప్పు పట్టుకొని వెళ్లాడు అనిరుధ్. తననే ఆశ్చర్యంగా చూస్తున్న బాలను చూస్తూ. ‘‘బాలా.. ఎవరి పనిని వారు పూర్తి చేసుకొని బంధాల నుంచి దూరమవుతారని ఈ ప్రక్రియలో తెలుసుకున్నాను. మన అబ్బాయి అనుకున్నవాడు మనకు ఈ జన్మ వరకే. మనసుకు మనసుకు మధ్య ప్రేమ ఉండాలే తప్ప వేదన ఉండకూడదు. నాకూ ఈ జీవితం పట్ల ఒక అవగాహన కలిగింది. మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకున్నాను. ఇక నా ఆరోగ్యం గురించి దిగులు పడకు..’’ అంటూ కాఫీ కప్పు అందించి ఆమె కళ్లనీళ్లను తుడిచాడు అనిరుధ్. ఆ మాటలు బాలకు ఎంతో భరోసాని కలిగించాయి. - నిర్మల చిల్కమర్రి ఒక్క క్షణం... శరీరం మరణించాక ‘చేతన’ ఎక్కడకు చేరుకుంటుందో ధ్యానప్రక్రియ ద్వారా బతికున్నవారు ‘చేతన’గానే అక్కడకు చేరుకుంటారు. దీనిని ‘రిగ్రెషన్ ఆస్ట్రల్ ట్రావెల్’ అంటారు. చేతనతో సంభాషించడాన్ని ‘ఛానలింగ్’ చేయడం అంటారు. ఒకసారి చేతనను కలుసుకున్నాక తమకు తాముగా జన్మప్రయాణాన్ని అర్థం చేసుకుంటారు. రాగ ద్వేషాలన్నింటినీ ఒకే ఒక్క క్షణంలో వదులుకుంటారు. - డా. న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ, హైదరాబాద్ ఇతిహాసంలో ఛానెలింగ్ ప్రక్రియ అభిమన్యుడి మరణంతో అర్జునుడు విపరీతమైన వేదనకు లోనయ్యాడు. ఎంతమంది ఓదార్చినా ఉపశమనం పొందలేదు. అతని వేదనను పోగొట్టడానికి ధ్యానప్రక్రియ ద్వారా అర్జునుడిని ఊర్థ్వలోకాలకు తీసుకెళ్తాడు కృష్ణుడు. అక్కడ అభిమన్యుడిని కలుసుకున్న అర్జునుడు ‘నువ్వు నా కొడుకువి’ అంటే... ‘ఇక్కడకు వచ్చాక కొడుకెవరు, తండ్రెవరు? అంతా ఒక్కటే కదా!’ అన్నాడట నవ్వుతూ. దీంతో బాధ నుంచి విముక్తిపొంది, తన కర్తవ్య సాధనపై దృష్టి నిలిపాడు అర్జునుడు. అంతర్జాతీయంగా చేతన సంభాషణలు ‘మరణించిన తర్వాత ‘చేతన’ ఎక్కడకు వెళుతుంది, ఆ చేతన తన వాళ్లతో ఎలా సంభాషిస్తుంది?’ అనే విషయాలతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనాత్మక గ్రంథాలు వచ్చాయి. వాటిలో ఖర్షోద్ భావ్‌నగరి ‘లాస్ ఆఫ్ ది స్పిరిట్ వరల్డ్’ పుస్తకం ప్రముఖమైనది. ముంబయ్‌కి చెందిన భావ్‌నగరి భర్త, కొడుకు కారు ప్రమాదంలో మరణించారు. ‘సోల్ ఛానలింగ్’ ద్వారా తన కొడుకుతో సంభాిషించింది. 1980లో రాసిన ఈ పుస్తకం కొన్ని మిలియన్ల మందిని అబ్బురపరిచింది.