Collapse buildings
-
స్పెయిన్‌లో వర్ష బీభత్సం
బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.This is SPAIN, most of you have been here.Demand #ClimateAction & don’t put up with #FossilFuel company misinformation.Flash floods in Spain leave at least 51 people dead.https://t.co/UEO9y7iPl3 pic.twitter.com/WqBikKltbM— Dr Jill Belch (@JillBelch) October 30, 2024రవాణా కుదేలుఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.నిన్నటిదాకా కరువు...స్పెయిన్ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్ డ్రాప్’తో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.SPAIN — The death toll from devastating flash floods in Spain’s eastern region of Valencia has risen to 51, with heavy rains submerging roads and sweeping away cars. The torrents, which followed an intense downpour, overwhelmed local infrastructure, turning town streets into… https://t.co/VwIMQh2FMq pic.twitter.com/yxHl0upKi8— News is Dead (@newsisdead) October 30, 2024క్రెడిట్స్: News is Dead Our thoughts are with Spain in the wake of the tragic flash floods. We extend our deepest condolences to those who have lost loved ones and express our gratitude to the rescuers working tirelessly to aid those affected. 🇪🇸 pic.twitter.com/c3RRSwH8OQ— EPP (@EPP) October 30, 2024 -
Noida twin towers: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు
మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్ టవర్స్‌ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది. ఏం జరిగింది? నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలోని సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లు ఇలా ? ► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు. ► ట్విన్ టవర్స్ సమీపంలోనిఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీస్‌లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి. ► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు. ► టవర్స్ సమీపంలోని నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు. ► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు. ► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది! ► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇలా కూలుస్తారు... ► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్ ఇంప్లోజన్ టెక్నిక్ సాయంతో కూల్చివేత జరుగుతుంది. ► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు. ► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు. ► సియాన్ టవర్‌లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్నూ పూర్తి కావచ్చింది. ► హర్యానాలోని పల్వాల్లో పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు. ► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. ► కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్‌కు సూపర్‌టెక్ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూడో రోజు సాగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
కొనసాగుతున్న కూల్చివేతలు
-
కొనసాగుతున్న కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మూడో రోజైన బుధవారం సైతం జీహెచ్ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పీడు మరింత పెంచారు. బుధవారం ఒక్కరోజే 211 నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తంగా కూల్చివేతలు 452కు చేరాయి. పేదలపై ప్రతాపం చూపవద్దని, భారీ అక్రమాలపైనే శ్రద్ధ పెట్టాలని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలందడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూల్చివేతలకు పూనుకున్నారు. రాయదుర్గంలోని మల్క చెరువు నాలాను ఆక్రమించిన భారీ నిర్మాణాలు, వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలోని హోటల్ కిచెన్‌హాల్ కూల్చివేతల్ని మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. మల్క చెరువు బఫర్‌జోన్‌లోని వే బ్రిడ్జి, స్క్రాప్ గోడౌన్లను కూల్చివేశారు. మూడోరోజు కూల్చివేతల్లో ముఖ్యంగా చెరువులపై వెలసిన వాణిజ్య నిర్మాణాలు, కూల్చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలున్న భవనాలు, నష్టపరిహారం చెల్లించిన నాలాల వెంబడి నిర్మాణాలు, బీఆర్ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ వహించారు. అక్రమాలను సహించం.. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, నగరంలో అక్రమ నిర్మాణాలను సహించేదిలేదని స్పష్టం చేశారు.