హైదరాబాద్ సిటీ: నాగన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దోబీఘాట్ వద్ద ఓ బిల్డర్ వర్గీయులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు మధ్య శనివారం తోపులాట జరిగింది. వివరాలు... బిన్‌ట్రిఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన బిల్డర్, జీహెచ్‌ఎంసీకి రూ. 6.90 లక్షలు రుణం చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించి బిల్డింగ్‌ను సీజ్ చేయడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది కంపెనీ కార్యాలయానికి వచ్చారు. వచ్చిన వెంటనే వెంచర్ లోని రెండు షాపుల్ని సీజ్ చేయగా బిల్డర్ బకాయిలకు సంబంధించి రెండు చెక్కులు వారికి అందించాడు. ఆ సమయంలో బిన్‌ట్రిఫ్ వర్గీయులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.