హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల విభజనపై బీజేపీ ఎమ్మెల్యే కె. లక్ష్మణ్ గురువారం హైదరాబాద్లో స్పందించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని ఆయన ఆరోపించారు. అధికారపార్టీ తొత్తులుగా అధికారులు వ్యవహరించారని విమర్శించారు.
వార్డుల విభజనపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని వార్డులను తగ్గించారని ఉన్నతాధికారులపై కె.లక్ష్మణ్ మండిపడ్డారు.