
వచ్చే ఎన్నికల్లో ఇదే మా అజెండా: బీజేపీ
సీఎం కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారని, అప్పుడు పదవులకు రాజీనామా చేయాలని మంత్రులను డిమాండ్ చేశారని కానీ, ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాలు జరుపుకుంటుండగా అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ఎందుకు మాట మార్చిందని నిలదీశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం.. వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాగా ఉంటుందని వివరించారు.
కాంగ్రెస్ పాపాలను కడుగుతున్న అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ తప్పిదాలను ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. ఇదంతా మజ్లిస్ పార్టీ మెప్పు, మచ్చిక కోసం పడే తాపత్రయమేనని తెలిపారు. రజాకార్ల మెప్పు కోసం సెప్టెంబర్ 17ను పక్కన పెట్టడం శోచనీయమన్నారు. సీఎం సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను చూసి ఆయన అభద్రతాభావంతో ఉన్నారని ఎద్దేవాచేశారు.