ప్రభుత్వ స్థలలతో పాటు అనుమతి లేని పలు ప్రాంతాల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లోని అంబేద్కర్ యూనివర్సిటీ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వస్థలంలో గుడిసెలు నిర్మించుకున్న పేదలను ఖాళీ చేయించడానికి వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అయినా అధికారులు బలవంతంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత
Published Tue, Feb 9 2016 8:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement