
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని కృష్ణ నగర్‌లో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో యువకుల మధ్య గర్షణకు ఒక నిండు ప్రాణం బలైంది. సుధీర్ అనే యువకుడిని నలుగురు యువకులు మద్యం మత్తులో చితకబాదారు. దీంతో సుధీర్ అక్కడి అక్కడే మృతి చెందాడు. మృతుడు మోతినగర్ హమాలిబస్తీకి చెందిన వాడిగా గుర్తించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్ రూట్‌లో వచ్చినందుకు యువకులు గొడవ పడ్డారని పోలీసులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో అందరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. నిందితుల్లో జూనియర్ ఆర్టిస్ట్ షేక్ జమాల్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment