సోదరుడితో విజయ్ దేవరకొండ
హైదరాబాద్ నగరంలో కొత్త రకం రౌడీలు హల్‌చల్ చేస్తున్నారు. మోడ్రన్ రౌడీలుగా మారాలని యువత ఉర్రూతలూగుతున్నారు. దీంతో ప్రతి బుధవారం వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వీళ్లు చొక్కాలే కాదు.. గళ్ల లుంగీలు కూడా ధరిస్తారు. అయినా సరే.. వీరు సూపర్ స్లైలిష్. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అర్జున్‌రెడ్డి ఫేం విజయ్‌దేవరకొండ లాంచ్ చేసిన రౌడీలే వీరంతా.
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) :టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 15న జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో ఆయన తన అభిమానులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు. అదే చేతితో రౌడీ వేర్ పేరుతో టెక్స్‌టైల్స్ లేబుల్‌ని, వెబ్‌సైట్ రౌడీ క్లబ్ డాట్ ఇన్‌ని లాంచ్ చేశాడు. వీటి ద్వారా ప్రతి బుధవారం పరిమిత శ్రేణిలో రౌడీవేర్‌ను ఆయన విడుదల చేస్తున్నాడు.
ఓవర్‌నైట్ స్టార్...
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో టాప్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ లాగే.. ఆయన యాప్ కూడా ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి బుధవారం రోజున కేవలం 24 గంటల్లోనే వీటి సేల్స్ కోసం ఆయన రూపొందించిన యాప్ అత్యధిక డౌన్‌లోడ్స్ జరిగాయని సమాచారం. తాజాగా రెండో బుధవారం ఏకంగా లుంగీలను లాంచ్ చేశాడు. అవి కూడా కేవలం 2 గంటల్లోనే నో స్టాక్ అనిపించుకున్నాయి. ఈ దుస్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఈ హీరో ప్రకటించాడు.
మనకు కొత్త... బాలీవుడ్‌కి పాత..
నిజానికి స్టార్స్ లేబుల్స్ స్టార్ట్ చేయడం అనేది టాలీవుడ్‌కి కొత్త గాని.. ఇది బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. సల్మాన్ ఖాన్, సోనమ్‌కపూర్, అలియాభట్ లాంటి తారలతో పాటు ఇటీవలే క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రాంగ్ పేరుతో లేబుల్ లాంచ్ చేశాడు. అయితే.. మన టాలీవుడ్ స్టార్స్ బిజినెస్ కోసం ఎక్కువగా రెస్టారెంట్స్, పబ్స్, జిమ్‌లు వంటివి మాత్రమే ఎంచుకున్నారు తప్ప సొంతంగా ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసే సాహసం చేయలేదు. విజయ్.. రౌడీవేర్.. మరెంతమంది స్టార్స్‌ని ఇన్‌స్పైర్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Comments
Please login to add a commentAdd a comment