Latest Fashion
-
Viral: బట్టలతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా?
Givenchy Suicide Hoodie Necklace Controversy: ఫ్యాషన్ ప్రపంచం ఓ పద్ధతి ప్రకారం నడవదు. ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుని కొత్తగా, వింతగా అనిపించడమే కాదు.. ఒక్కోసారి ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. తాజాగా ఓ ఫ్రాన్స్ దుస్తుల కంపెనీ రూపొందించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ‘బట్టలతో మనుషుల్ని చంపేయగలవ్ తెలుసా?’.. ఇది సినిమా డైలాగ్. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ దుస్తుల కంపెనీ గివెంచీ అది నిజమని నిరూపిస్తోంది. Spring 2022-Ready to Wear collectionలో భాగంగా ఉరితాడును పోలి ఉన్న ఓ నెక్లెస్‌ను డ్రెస్‌కు అంటగట్టింది. ఆ దుస్తులతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేయగా.. చూసినోళ్లంతా ‘చావమంటారా?’ అని తిట్టిపోస్తున్నారు. దీంతో గివెంచీ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ విలియమ్స్.. ఆ దుస్తుల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. గతంలో బ్రిటిష్ దుస్తుల కంపెనీ బర్బెర్రీ 2019లో ఇదే తరహాలో ‘నూస్ హూడీ’(సూసైడ్ హూడీగా ట్రోల్ చేశారు)ని డిజైన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బర్బెర్రీ మోడల్ లిజ్ కెనెడీ ‘సూసైడ్ ఏం ఫ్యాషన్ కాదు’ అంటూ సెటైర్లు వేయడంతో కంపెనీ వెనక్కి తగ్గింది. అంతేకాదు ఆ టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న మార్కో గోబెట్టి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by Diet Prada ™ (@diet_prada) ఇక గివెంచీ చర్యల నేపథ్యంలో ప్యాషన్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ‘డైట్ ప్రదా’ ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన దుస్తుల ఫొటోల్ని కంపేర్ చేస్తూ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేయగా.. దుమారం మొదలైంది. View this post on Instagram A post shared by @liz.kennedy_ చదవండి: నెట్‌ఫ్లిక్స్‌ను ఆకాశానికెత్తిన అమెజాన్ బాస్ -
సిటీలో స్టేట్ 'రౌడీ'
హైదరాబాద్ నగరంలో కొత్త రకం రౌడీలు హల్చల్ చేస్తున్నారు. మోడ్రన్ రౌడీలుగా మారాలని యువత ఉర్రూతలూగుతున్నారు. దీంతో ప్రతి బుధవారం వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వీళ్లు చొక్కాలే కాదు.. గళ్ల లుంగీలు కూడా ధరిస్తారు. అయినా సరే.. వీరు సూపర్ స్లైలిష్. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అర్జున్‌రెడ్డి ఫేం విజయ్‌దేవరకొండ లాంచ్ చేసిన రౌడీలే వీరంతా. సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) :టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 15న జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ పబ్‌లో ఆయన తన అభిమానులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు. అదే చేతితో రౌడీ వేర్ పేరుతో టెక్స్టైల్స్ లేబుల్‌ని, వెబ్సైట్ రౌడీ క్లబ్ డాట్ ఇన్ని లాంచ్ చేశాడు. వీటి ద్వారా ప్రతి బుధవారం పరిమిత శ్రేణిలో రౌడీవేర్ను ఆయన విడుదల చేస్తున్నాడు. ఓవర్‌నైట్ స్టార్... ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో టాప్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ లాగే.. ఆయన యాప్ కూడా ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. తొలి బుధవారం రోజున కేవలం 24 గంటల్లోనే వీటి సేల్స్ కోసం ఆయన రూపొందించిన యాప్ అత్యధిక డౌన్లోడ్స్ జరిగాయని సమాచారం. తాజాగా రెండో బుధవారం ఏకంగా లుంగీలను లాంచ్ చేశాడు. అవి కూడా కేవలం 2 గంటల్లోనే నో స్టాక్ అనిపించుకున్నాయి. ఈ దుస్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఈ హీరో ప్రకటించాడు. మనకు కొత్త... బాలీవుడ్‌కి పాత.. నిజానికి స్టార్స్ లేబుల్స్ స్టార్ట్ చేయడం అనేది టాలీవుడ్‌కి కొత్త గాని.. ఇది బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. సల్మాన్ ఖాన్, సోనమ్‌కపూర్, అలియాభట్ లాంటి తారలతో పాటు ఇటీవలే క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రాంగ్ పేరుతో లేబుల్ లాంచ్ చేశాడు. అయితే.. మన టాలీవుడ్ స్టార్స్ బిజినెస్ కోసం ఎక్కువగా రెస్టారెంట్స్, పబ్స్, జిమ్‌లు వంటివి మాత్రమే ఎంచుకున్నారు తప్ప సొంతంగా ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసే సాహసం చేయలేదు. విజయ్.. రౌడీవేర్.. మరెంతమంది స్టార్స్‌ని ఇన్స్పైర్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి. -
ఇదే లేటెస్ట్ ఫ్యాషన్!
ఏ వస్తువైనా, దుస్తులైనా కొనాలంటే మార్కెట్‌కు వెళ్లడం పాత పద్దతి. ఇంట్లో నుంచి బయటకు కదలకుండా ఆన్లైన్లో సెర్చ్ చేసి కొరుకున్న వస్తువును కొనుగోలు చేయడం లేటెస్ట్ ఫ్యాషన్ అయింది. సమయం సందర్భం లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా కొనుగోలు చేసే అవకాశమున్న ఆన్లైన్ మార్కెట్ రాకెట్ వేగాన్ని మించిపోతోంది. ఆన్లైన్ దెబ్బకు నిన్నటి వరకు కళకళలాడిన రిటైల్ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. దేశంలో ఆన్లైన్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు ఓ మోస్తరు నగరాలు, పట్టణాలకు కూడా పాకింది. ఇంటికి చేర్చే అవకాశం ఉంటే గ్రామలకు కూడా విస్తరించడం ఖాయం. త్వరలో ఆ ముచ్చట కూడా తీరుతుంది. అందరికీ ఆన్లైన్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులతో పాటు వ్యాపారం కూడా భారీస్థాయిలో విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు ఆన్లైన్ మార్కెట్ చేరిందని లెక్కలు చెపుతున్నాయి. కోరుకున్న వస్తువు దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయడం కాకుండా, కొరుకున్న వస్తువును అనుకున్న చోటుకు తెచ్చే ఆన్లైన్ వ్యాపారంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వస్తువు ఏదైనా సరే దుస్తుల నుంచి బుక్స్ వరకు, పలక నుంచి పుస్తకం వరకు, టీవీ నుంచి ఫ్రిజ్ వరకు సమస్తం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రిటైల్ వ్యాపారాన్ని 30-50 శాతం మేర ఈ కామర్స్ మార్కెట్ షేర్ చేసుకుందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. 2016 కల్లా ఈ-కామర్స్ మార్కెట్ 93 వేల కోట్ల రూపాయలకు ఎగబాకే అవకాశముందని భావిస్తున్నారు. 2012లో ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షల మంది కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3 కోట్ల 50 లక్షలకు చేరింది. 2016 నాటికి ఆన్లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ సుమారు 18,600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆన్ లైన్ మార్కెట్ కస్టమర్లకు అన్నిరకాలుగా సేవలను అందిస్తుండటంతో వినియోగదారులు ఆన్లైన్ వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నారని రిటైల్ వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామర్స్ మార్కెట్ భవిష్యత్తులో రిటైల్ వ్యాపారం లేకుండా చేయొచ్చనే భయాందోళనలు కూడావ్యక్తం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ మార్కెట్లోనూ ఈ కామర్స్ తన సత్తా చాటుతోంది. లేటెస్ట్ టెండ్ర్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను ఇప్పటికే పూర్తి స్దాయిలో తనవైపు తిప్పుకుంది. వాషింగ్‌మెషిన్, ఫ్రిజ్, ఏసీ లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను అన్ లైన్ మార్కెట్లో కాకుండా రిటైల్ మార్కెట్లోనే కొనడం వల్ల కస్టమర్లకు ప్రయోజకరంగా ఉంటుందని ఎలక్ట్రానిక్స్ రిటైల్ వ్యాపారస్తులు అంటున్నారు. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం, ఆన్లైన్లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణంగా కనపడుతోంది. ఎక్కడినుంచైనా, సమయంతో సంబంధంలేకుండా షాపింగ్ చెసే వెసులుబాటు ఉండటం వల్ల ప్రధానంగా యువత ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆఖరికి తినుబండారుల కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ-కామర్స్ మార్కెట్ మరింత విస్తరిస్తే మునుముందు ఒక్క ఏంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నగర వాసులు బయటికి వెచ్చే అవకాశం వుంటుంది. -
కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు
కేజీ.. బుల్లెట్ బైకుల్లో రారాజు అనే మాట ‘బుల్లెట్’కు సరిగ్గా సరిపోతుంది. రివాల్వర్ బుల్లెట్లా ఇది కూడా అంతే వేగంగా దూసుకుపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే హల్చల్ చేసిన ఈ బుల్లెట్.. నేటి కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా నిలిచి.. ఇప్పుడు యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. దిగువ స్థాయి పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ వీటి హవా కొనసాగుతుంది. పెనుగొండ వంటి గ్రామంలో యువకులు నెల రోజుల్లో 15 వరకు బుల్లెట్లు కొనుగోలు చేసారంటే వీటికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. - పెనుగొండ రూరల్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ మారుతోంది. దానికి తగ్గట్టుగానే యూత్ స్టైల్లో కూడా డిఫరెంట్ లుక్ వచ్చింది. రకరకాల ఫ్యాషన్లు.. రోజుకొక డిజైన్.. ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో నేటి యువత పాతతరాన్నే రోల్ మోడల్‌గా తీసుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్‌లో హీరోలు వాడిన కాస్ట్యూమ్స్ నుంచి కళ్లద్దాల వరకు అన్నింటినీ ఫాలో అవుతూ నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ కోవకే చెందుతూ.. తాజాగా తెరపైకి వచ్చినవే బుల్లెట్లు. ఒకప్పుడు హుందాతనానికి, శరీర సౌష్టవానికి సింబల్‌గా భావిస్తూ ఉపయోగించిన బుల్లెట్లను నేడు ఫ్యాషన్ కోసం, కొత్తగా కనిపించడం కోసం వాడుతున్నారు. ఇక యూత్ ఆసక్తిని గమనించిన కంపెనీలు రకరకాల బుల్లెట్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ‘రాయల్’ లుక్ ఇరవై ఏళ్ల కిందట ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ వినియోగించే వారిలో రాజసం కనిపించేది. బండికి తగిన హుందాతనం, శరీర సౌష్టవంతో ఆకట్టుకునే వారు. బుల్లెట్ వాడేవారిని కోటీశ్వరుడిగా పరిగణించే వారు. కాలానుగుంగా పెట్రోల్ ధరలు పెరగడం, కార్ల ధరలు అందుబాటులోకి రావడంతో బుల్లెట్ల వినియోగం తగ్గింది. ఆ తరువాత కనుమరుగయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆధునిక హంగులతో వివిధ రకాల రంగులు, అనేక మోడళ్లతో వస్తూ నేటి యువతరం హృదయాల్లో స్థానం సంపాదించేశాయి. గ్రామీణ రోడ్లలోనూ హల్చల్ చేస్తున్నాయి. హుందాతనానికి రాయల్ ఎన్ఫీల్డ్ వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ల అమ్మకాలు మనదేశంలో 1949లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోలీసులు, మిలటరీ వాళ్లు వీటని ఎక్కువుగా వినియోగించేవారు. 1994లో మద్రాసులో ఎన్ఫీల్డ్ ఇండియా, ఐషర్ కంపెనీలు విలీనమయ్యాయి. అప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌గా రూపాంతరం చెందింది. ఇదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్స్ పార్క్ 350, ట్విన్స్పార్క్ 500, ఎలక్ట్రా ట్విన్స్ పార్క్, క్లాసిక్ 350, క్లాసిక్ 500, క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ డిసర్ట్స్ట్రోమ్, కాంటినెంటల్ జీటీ, తండర్ బార్డ్ 350, తండర్ బార్డ్ 500 వంటి పది రకాల మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూమ్ ధర రూ.96 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఉంది. ఆధునికతతో అందంగా.. 350, 500 సీసీతో ఐదు గేర్లతో బుల్లెట్లు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. గతంలో బుల్లెట్‌కు కిక్‌స్టార్ ఉండేది. కిక్ కొట్టాలంటే కండలు తిరిగిన శరీర సౌష్టవం కావాలని భావించేవారు. ప్రస్తుతం సెల్ఫ్స్టార్ సిస్టంతో అందుబాటులోకి వచ్చాయి. 40 కిలోమీటర్లకు పైగా మైలేజీ కూడా ఇస్తుండటంతో దీని క్రేజ్ పెరిగింది.