gvmc officials
-
కులుమనాలిలో చిక్కుకున్న జీవీఎంసీ కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన 74 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కులు మనాలిలో చిక్కుకు పోయారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో దాదాపు 20 గంటలపాటు నీరు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఆర్మీ అధికారులు శనివారం రాత్రి ట్రాఫిక్ క్లియర్‌చేసి వాహనాలను వదలడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నుంచి మొత్తం 141 మంది ఈ నెల 16న అధ్యయన యాత్రకి వెళ్లారు. తొలుత ఢిల్లీ, ఆ తర్వాత సిమ్లాకు వెళ్లారు. అక్కడి నుంచి కులు మనాలి వెళ్లారు. మనాలి కార్పొరేషన్ విజిట్ అనంతరం శుక్రవారం చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిలో ఏడుగురు విమానంలో చండీగఢ్ వెళ్లేందు కులు మనాలిలో ఉండిపోయారు. మిగతా 134 మంది 4 బస్సుల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరారు. చండీఘర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో మండీ వద్ద జోరుగా కురుస్తున్న వానకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్పొరేటర్ల బస్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు బస్సులోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని కొందరు కార్పొరేటర్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల అనంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రం నుంచి ఆర్మీ అధికారులు వచ్చారని, కొన్ని అరటిపండ్లు, రొట్టెలు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత అధికారులు రోడ్డుపై బండ రాళ్లను, దెబ్బ తిన్న వాహనాలను తొలగించారు. దీంతో కార్పొరేటర్ల బస్సులు కూడా బయల్దేరాయి. అందరూ సురక్షితం : మేయర్ కార్పొరేటర్లంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి చెప్పారు. కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి వైజాగ్ వస్తారని ఆమె తెలిపారు. -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది) -
రోజు ఏమార్చి రోజు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి. అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది. ఇదీ అసలు ఉద్దేశం వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారవుతోంది. ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం. పక్కాగా రూట్ ఉండాలంటూ...! చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దూరమవుతుందంటూ..! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. (చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట) -
విశాఖలోని పేదల చేతికి పదివేల కోట్ల ఆస్తి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లోని పేద ప్రజల సొంతింటి స్వప్నం నిజం కాబోతోంది. ఎన్నో ఏళ్లుగా తాము ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నారు. విశాఖపట్నం పరిధిలో భారీగా పెరిగిన భూమి ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇళ్ల పట్టాల విలువను లెక్కిస్తే.. ఆ ఆస్తి విలువ రూ. 10 వేల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలో టీడీపీ హయాంలో అంటే 2014–19 మధ్యకాలంలో కేవలం 13,686 మందికి మాత్రమే పట్టాలను జారీచేశారు. అది కూడా కేవలం తమ పార్టీ వారికేనన్న విమర్శలున్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పట్టాలను మహిళల పేరు మీద అందించనుంది. ఇందుకోసం అర్హుల జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారుచేశారు. జీవీఎంసీ పరిధిలో ఇంత భారీగా గతంలో ఎన్నడూ ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. మొత్తంగా విశాఖ చరిత్రలో ఈ ఇంటి పట్టాల పంపిణీ గొప్పగా నిలిచిపోనుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కుట్రలపై విజయం.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పనులు చేపట్టారు. అయితే, జీవీఎంసీ పరిధిలో మాత్రం ఇంటి పట్టాల పంపిణీ జరగకుండా తప్పుడు పేర్లు, ఫిర్యాదులతో హైకోర్టులో ప్రతిపక్షాలు కేసులు వేశాయి. ఫలితంగా గతంలో ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. అయితే, కోర్టులో విచారణలో అసలు కేసులో పేర్కొన్న వ్యక్తులు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని, వారి పేరుతో తప్పుడు కేసును వేశారని పూర్తి ఆధారలతో స్పష్టమైంది. హైకోర్టులో కేసు వీగిపోవడంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. వాస్తవానికి విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఇంటి స్థలం కొనుగోలు చేయడం సాధారణ ప్రజలకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల అనేక మంది అద్దె ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని పేదలకు ఇచ్చేందుకుగానూ 4,661.42 ఎకరాల్లో 71 లేఅవుట్లలో 1.23 లక్షల మందికి ఇంటి పట్టాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెంట్ చొప్పున స్థలం అందనుంది. పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు అంతర్గత డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, 30 అడుగుల రోడ్లు, ఇతర సదుపాయాలతో మొత్తం 71 లేఅవుట్లలో పూర్తిగా అభివృద్ధి చేశారు. ఈ లేఅవుట్లు ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. ఉదాహరణకు ఆనందపురం మండలంలో తంగుడుబిల్లి వంటి చోట్ల సెంటు ధర ఏకంగా రూ. 10 లక్షలు పలుకుతోంది. ఇక పద్మనాభం మండలం రెడ్డిపల్లి లేఅవుట్లో సెంటు ధర రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. సగటు ధర లెక్కిస్తే సెంటు రూ. 5.70 లక్షలు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. మొత్తం 1.23 లక్షల మందికి లెక్కిస్తే సుమారు ఈ మొత్తం రూ. 8,270 కోట్లు అవుతుంది. ఇక ఇందులో లక్ష మందికి ఇళ్లను మంజూరు చేయగా.. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం మరో రూ. 1,800 కోట్లు అవుతుంది. అంటే మొత్తం రూ.10,070 కోట్ల ఆస్తిని జీవీఎంసీలోని పేద ప్రజలకు సీఎం అందించనున్నారని అధికారులు చెబుతున్నారు. -
పోతేపోనీ.. రూ.35 లక్షలే కదా సర్.!!
సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏముంది సర్... రూ.35 లక్షలు పోతేపోనీ.. రూ.60 లక్షలు ఇస్తామంటున్నారు కదా.. తిరిగి వారికే ఇచ్చేద్దాం’’ డైమండ్ పార్క్ దరి తందూరీ ఇన్ హోటల్ లీజు వ్యవహారంపై జీవీఎంసీలో గురువారం రాత్రి జరిగిన చర్చ ఇదీ. వివరాల్లోకి వెళ్తే... జీవీఎంసీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో తందూరీ ఇన్ హోటల్ దాదాపు ఇరవై ఏళ్లుగా రూ.1.34 కోట్ల లీజు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.39 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.95 లక్షలు లీజు డబ్బులు చెల్లించాలని జీవీఎంసీ నోటీసులు అందించగా.. హోటల్ యజమానులు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే బకాయిలు పూర్తిగా చెల్లించాలని, అనంతరం వేలం వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై గురువారం రాత్రి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు ఒకరిద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లు సమావేశమైనట్లు సమాచారం. రూ.95 లక్షల్లో రూ.౩5 లక్షల వరకూ ఉన్న వడ్డీని మినహాయించాలని కొందరు కార్పొరేటర్లని సదరు యజమాని ఆశ్రయించినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులను ఒప్పించేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రూ.60 లక్షలు వస్తున్నప్పుడు రూ.35 లక్షలు వదిలేద్దామని అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: (ఫలించిన సమన్వయ మంత్రం.. శ్రీశైలంలో సడలిన ఉద్రిక్త పరిస్థితులు) -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కనీస వేతనం చెల్లించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సమాన పనికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం వివక్ష చూపడమేనని పేర్కొంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం చెల్లించాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. అయితే తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశాలివ్వాలన్న బాల్వాడీ టీచర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తాము రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు కనీస వేతనాలు చెల్లించడంగానీ, తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంగానీ చేయడం లేదంటూ జానపరెడ్డి సూర్యనారాయణ, మరో 49 మంది హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో నెలకు రూ.375 వేతనం ఇచ్చేవారని, తరువాత దాన్ని రూ.1,300కు, 2016లో రూ.3,700కు పెంచారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి కనీస వేతనం రూ.6,700గా నిర్ణయిస్తూ ప్రభుత్వం 2011లో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని మునిసిపల్ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినా, జీవీఎంసీ అమలు చేయలేదని తెలిపారు. పిటిషనర్లు ఔట్‌సోర్స్ పద్ధతిలో ఓ ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారని, అందువల్ల వారు సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులు కాదని జీవీఎంసీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి.. పిటిషనర్లు రెగ్యులర్ ఉద్యోగుల్లాగే 8 గంటలు పనిచేస్తున్నప్పుడు వారితో సమానంగా వేతనం పొందేందుకు అర్హులని తీర్పు చెప్పారు. వారికి కనీస వేతనాన్ని వర్తింపజేయాలని పురపాలకశాఖను ఆదేశించారు. పిటిషనర్లు ఎన్‌ఎంఆర్‌లుగా, రోజూవారీ వేతనాలు పొందేవారిగా నియమితులు కాలేదని, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్స్ పద్ధతిలో నియమితులయ్యారని, సర్వీసు క్రమబద్ధీకరణ కోరజాలరని తీర్పులో పేర్కొన్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్‌లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు మరోవైపు..నగరంలోని ఫుట్పాత్లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్‌రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు. -
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
-
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాకలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని అధికారులు తొలగించారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
ఇదో మంచి 'బ్యాక్టీరియా'..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నిత్యం వస్తున్న మురుగునీటిని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) శుద్ధిచేసి పరిశ్రమలకు కొంత, మిగిలినది సముద్రంలోకి విడిచిపెడుతుంది. ఈ క్రమంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లు.. వాటి పరిసరాలు చాలా దుర్వాసన వెదజల్లేవి. పాదచారులు, వాహనచోదకులు ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఈ తరుణంలో జీవీఎంసీ అధునాతన బయో సాంకేతికతను అందిపుచ్చుకుంది. అదే బయోరెమిడేషన్. అంటే.. మంచి బ్యాక్టీరియాలతో మురుగునీటిని శుభ్రంచేయడం. ఇందుకోసం పయోనీర్ ఎన్విరాన్ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మూడు పద్ధతుల్లో.. ఈ మురుగునీటిని శుభ్రం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. మానవాళికి మంచి చేసే బ్యాక్టీరియాలుంటాయి. ఇందులో ఫొటోట్రోఫిక్, లాక్టోబాసిలస్, రోడో సుడోమాస్ అనే బ్యాక్టీరియాలను పయోనీర్ సంస్థ తమ ల్యాబ్‌లో ఉత్పత్తి చేస్తుంది. వీటిని అప్పుఘర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తీసుకొచ్చి మంచినీటిలో పెంచుతారు. ఇవి పెరిగేందుకు మొలాసిస్‌ను ఆహారంగా వేస్తారు. 5–7 రోజుల్లో ఇవి పెరుగుతాయి. వీటికి కావల్సిన ఉష్ణోగ్రతను కూడా దశల వారీగా అందిస్తారు. మొదటి నాలుగు రోజులు 1–5 డిగ్రీలు, తర్వాత 5–15 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెంచుతారు. ఇలా వారం రోజుల్లో 0–50 డిగ్రీల ఉష్ణోగ్రతని తట్టుకునేలా వీటిని తయారుచేస్తారు. ఫొటోట్రోఫిక్ బ్యాక్టీరియా చెత్తనీటిలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుతుంది. లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా సీవేజ్ వాటర్‌లో 80 శాతం ఆర్గానిక్ వ్యర్థాలను తినేస్తుంది. రోడో సుడోమాస్ కొన్ని ఎంజైమ్‌లు విడుదల చేసి.. మిగిలిన రెండు బ్యాక్టీరియాలకు అవసరమైన శక్తిని అందించి.. శుద్ధిచేసే పనిని వేగవంతం చేస్తుంది. వీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో పెంచుతారు. 1 లీటర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు ఖర్చవుతుంది. ఎరేషన్ ట్యాంకులో శుభ్రమవుతుందిలా.. వెయ్యి లీటర్ల మురుగుకు లీటర్ బ్యాక్టీరియా ఇలా పెరిగిన బ్యాక్టీరియాని ఎస్టీపీలోకి విడిచి పెడతారు. వెయ్యి లీటర్ల మురుగు నీటికి బ్యాక్టీరియా ఉన్న లీటర్ నీటిని కలుపుతారు. వివిధ మురుగు కాలువలు, మరుగుదొడ్ల నుంచి వచ్చిన నీరు స్టోర్ అయిన ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని పంపిస్తారు. అక్కడి నుంచి ఎరేషన్ ట్యాంకులోకి వెళ్తుంది. ఈ ట్యాంకులో ఆక్సిజన్ శాతం సరైన మోతాదులో ఉంటే.. ఈ బ్యాక్టీరియాలు తమ పనిని వేగవంతం చేస్తాయి. చెత్తను, మురుగుని తినేయడం ప్రారంభిస్తాయి. మొత్తంగా నీటిని 4 గంటల వ్యవధిలోనే శుభ్రం చేసేస్తాయి. ఇలా శుభ్రం చేసిన నీటిని అవుట్లెట్లోకి పంపిస్తారు. అక్కడ మరోసారి శుభ్రంచేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టడం, పరిశ్రమలకు అందించడం చేస్తారు. ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని ఇలా విడిచిపెడతారు.. పర్యావరణహితంగా అమలుచేస్తున్నాం.. మురుగునీటిని శుద్ధిచేశాకే బయటకి విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ మేరకు ఎస్టీపీల్లో శుద్ధిచేస్తున్నాం. అయితే, మరింత అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటిని పునర్వినియోగం చేసేందుకు జీవీఎంసీ కమిషనర్ సంకల్పించారు. ఆమె సూచనల మేరకు రెండు ఎస్టీపీల్లో బయో రెమిడేషన్ అమలుచేశాం. సత్ఫలితాలిస్తోంది. వారం రోజుల్లోనే దుర్వాసన దాదాపు తగ్గిపోయింది. ఇక నగరంలోని అన్ని ఎస్టీపీల్లో దీనిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తాం. – వేణుగోపాలరావు, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రాణవాయువు విడుదల చేసి స్వచ్ఛంగా మారుస్తాయి రసాయనాలతో పనిలేకుండా బయో టెక్నాలజీతో మురుగునీటి వనరుల్ని శుభ్రంచేస్తున్నాం. మానవాళికి మంచిచేసే బ్యాక్టీరియాలు నీటిలోని కాలుష్య కారకాల్ని ఆహారంగా తీసుకుని ప్రాణవాయువుని విడిచిపెట్టి.. వాటిని స్వచ్ఛంగా మారుస్తాయి. కేవలం నాలుగైదు గంటల్లోనే మురుగునీరు మంచి నీరుగా మారిపోతుంది. ఫార్మా కాలుష్యాలను కూడా దీని ద్వారా శుద్ధిచేయగలం. – దండు వెంకటవర్మ, పయోనీర్ ఎన్విరాన్ కేర్ సీఈఓ -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొరియర్లో తలనీలాలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం సీపీఐ నేతలు శిరోముండనం చేయించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలనీలాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొరియర్ ద్వారా పంపనున్నట్టు వారు వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేటాయింపు, నిధుల మంజూరులో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపారని మండిపడ్డారు. సీపీఐ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎం.శ్రీనివాస్, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎ.విమల, జి.జయమ్మ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసులు సిద్ధం చేశారు. నగరంలోని సెవెన్ హిల్స్ సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం 2020-21 సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం పది లక్షలు మాత్రమే టీడీపీ కార్యాలయం నిర్వాహకులు చెల్లించగా, 17 లక్షలు బకాయి పడ్డారు. (చదవండి: టీడీపీలో రాజీనామాల పర్వం..) మిగిలిన చెల్లింపులు కోసం అధికారులు నోటీసులు పంపించిన కానీ టీడీపీ కార్యాలయం నుంచి సరైన స్పందన లేకపోవడంతో 17 లక్షల ఆస్తి పన్ను బకాయిలకు గాను జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసును సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు.. గతంలో ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను నిర్ణయించడంతో సవరించాలని కోరామని.. అందుకే చెల్లింపులో జాప్యం జరిగిందని చెబుతున్నారు.(చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..) -
అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా
తగరపువలస/కొమ్మాది(భీవిులి): విశాఖ జిల్లా మంగమారిపేటలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనలు ఉల్లంఘించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గోకార్టింగ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్‌పై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అధికారులు కొరడా ఝుళిపించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ డి.రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం గోకార్టింగ్ సెంటర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీతో గోడలు, హట్లు, కంటైనర్ రెస్టారెంట్లను నేలమట్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన కాశీవిశ్వనాథ్, అతని కుటుంబ సభ్యులు మెస్సర్స్ కాశీ ఎంటర్ప్రైజెస్ అండ్ రిసార్ట్స్ పేరుతో 2014లో కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 299/1, 302/1సీ, 302/5సీలో ఉన్న 5.05 ఎకరాల్లో గోకారి్టంగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకు అప్పట్లో కె.నగరపాలెం పంచాయతీ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ కార్ రేసింగ్, స్పోర్ట్స్ క్లబ్, రెస్టారెంట్ తదితరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 0.44 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించారు. అయితే భీమిలి మండలంలోని ఐదు తీరప్రాంత పంచాయతీల్లో ఒకటైన కె.నగరపాలెం జీవీఎంసీలో విలీనమయ్యింది. గోకార్టింగ్ సెంటర్‌ను నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినందున విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్వాహకులకు ఏడాది కాలంలో 2సార్లు నోటీసులిచ్చారు. అయినా వారి నుంచి స్పందన రాలేదు. మరోవైపు ఇక్కడ జూదానికి సంబంధించిన కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా, సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రభుత్వ భూమి ఆక్రమణ, సరైన అనుమతులు లేకపోవడం వల్ల చట్టప్రకారం నిర్మాణాలు తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సాగర తీరంలోని నిర్మాణాలకు అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ అవి లేకపోయినా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆక్రమణల కూల్చివేత
-
మెడలు విరిచేస్తా.. అంతు తేలుస్తా
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి శనివారం రెచ్చిపోయారు. విశాఖ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇంటి ప్రహరీని, రెస్టు రూమ్‌ను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కూల్చివేసినందుకు అసభ్య పదజాలంతో ప్రభుత్వం, అధికారులపై విరుచుకుపడ్డారు. ‘మెడలు విరిచేస్తా.. ఒక్కొక్కడి అంతు తేలుస్తా.. నా ఈక కూడా పీకలేరు.. ఎవ్వడినీ వదిలిపెట్టను’ అంటూ చిందులు తొక్కారు. రాయడానికి కూడా వీలు లేని భాషలో, సభ్యత మరిచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. సబ్బం అనుచరులు కూడా అధికారులపై, కూలీలపై దౌర్జన్యానికి దిగడంతోపాటు, వారిని కులం పేరుతో దూషించి నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సబ్బం హరి అక్రమాల లీలలిలా.. ► విశాఖలోని రేసపువానిపాలెంలో సర్వే నంబర్ 7లో సుజనీ పార్క్ ఉంది. దీనికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన సబ్బం.. 2012లో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్‌తో భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. ► 592.93 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీ ప్లాన్ మంజూరు చేసింది. ► పక్కనే రూ.3 కోట్ల విలువ చేసే 212 చదరపు గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసేసిన సబ్బం ఆ స్థలంలో ప్రహరీ, రెస్టు రూమ్‌ను నిర్మించారు. ఈ ఆక్రమణలను గత నెల 5న ఏపీఎస్ఈబీ కాలనీ ప్రజలు జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. ► అధికారుల కొలతల్లో ప్లాన్ ప్రకారం.. భవనం 58 అడుగులు మాత్రమే వెడల్పు ఉండాల్సి ఉండగా.. దీనికి అదనంగా 12 అడుగుల మేర ఉంది. పొడవుని లెక్కిస్తే 159 అడుగుల మేర ఆక్రమించినట్లు తేలింది. ► ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఉంది. జీవీఎంసీ ఈ నెల 2న సబ్బం ఇంటికి నోటీసులు అంటించింది. స్పందన లేకపోవడంతో శనివారం జేసీబీలు తీసుకొచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ► 212 చదరపు గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రో చెప్పారు. సబ్బం ప్లాన్‌కు దరఖాస్తు చేసినప్పుడు పార్కు స్థలాన్ని రోడ్డుగా చూపించారని, స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కూల్చివేశామన్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా: సబ్బం హరి ఖాళీ స్థలంలో రెస్ట్ రూమ్ నిర్మించాను. అంతమాత్రాన రాత్రికి రాత్రి వచ్చి కొట్టేస్తారా? 24 గంటల్లో సమస్యని ముగిస్తా. నేనేంటో సీఎంకు తెలుసు.. విజయసాయికి ఇంకా తెలియదనుకుంటా. వైజాగ్‌లో కూర్చొని డ్యాన్స్ చేద్దామనుకుంటున్నారు.. ఆ డ్యాన్స్ కట్టిస్తాను. నా గురించి తెలియక ఇలా చేశారు.ఎందుకు చేశాం రా అని వాళ్లే అనుకునే స్థాయికి తీసుకెళ్తాను. వైఎస్ జగన్ నాపై కక్ష సాధింపు చేయలేరు. ఇలా చేసి మిగిలినవారికి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నారు. నేనేంటో అందరికీ చూపిస్తా. -
విషాద జ్ఞాపకాల్ని కడిగేసి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువు చేదు జ్ఞాపకాలను కడిగేశారు. స్టైరీన్ అవశేషాలు ఒక్క శాతం కూడా లేకుండా తుడిచేశారు. మూగజీవాల మృత కళేబరాలను తొలగించారు. ప్రతి గ్రామం.. వీధి.. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి కాలుష్య ఛాయలు లేకుండా క్లీన్ చేశారు. ప్రమాదానికి గురైన ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ రూపురేఖలను కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చింది. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) సీఎం ఆదేశాలతో.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు 5 గ్రామాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందుకోసం 700 మంది సిబ్బందిని మోహరించారు. ► గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. వాయు కాలుష్యానికి మాడిపోయిన చెట్లు, మొక్కలను, కాలువల్లో పూడికను తొలగించారు. చనిపోయిన పశు కళేబరాలను తరలించారు. ► వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇళ్ల లోపల కూడా రసాయనిక వాయువుల జాడ లేకుండా శుభ్రం చేశారు. ► 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 5 బెల్ మిస్ట్ భారీ యంత్రాలు, 6 టాటా ఏస్ వాహనాల ద్వారా ప్రధాన రోడ్లపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేసి బ్లీచింగ్ చల్లారు. ► వ్యాధులు ప్రబలకుండా 100 మంది మలేరియా సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చాక ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులను వివరిస్తూ అవగాహన కల్పించారు. ► సోమవారం సాయంత్రానికి ఐదు గ్రామాల ప్రజలను వారి ఇళ్లకు తరలించారు. ► వాటర్ వర్క్స్ ఏఈల ఆధ్వర్యంలో స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని శుభ్రం చేశారు. గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు ఎస్ఈ వేణుగోపాల్ ఆదేశాలతో 30 ట్యాంకర్లతో 80 ట్రిప్పులు సరఫరా చేశారు. ► కుళాయిల ద్వారా కూడా గృహాలకు మంచినీటి సరఫరా చేశారు. అలాగే యూసీడీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రికి గ్రామస్తులకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు. ► ఐదు గ్రామాల ప్రజలకు 20 వేల మాస్కులను పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అన్ని వసతులు కల్పించారు ప్రభుత్వం చెప్పిన విధంగానే మాకు అన్ని వసతులు కల్పించారు. ఈ ప్రాంతంలో అంతటి ప్రమాదం జరిగిందన్న ఆనవాళ్లు లేకుండా ఊళ్లను శుభ్రం చేయించారు. – పుల్లేటికుర్తి పుష్ప, వెంకటాపురం ప్రభుత్వ చర్యలు బాగున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అద్భుతం. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు సైతం భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది. – వెంకటరమణరావు, న్యాయవాది, వెంకటాపురం జీవితాంతం రుణపడి ఉంటాం ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మమ్మల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చారు. సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం. – యడ్ల వరలక్ష్మి, వెంకటాపురం నాలుగు రోజుల తర్వాత అమ్మ ఒడికి... నాలుగు రోజుల తర్వాత చంటి బిడ్డ కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో అస్వస్థతకు గురైన ఎ.నాగమణి ఈ నెల 7 నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమె కోలుకోవడంతో రెండు నెలల పసికందును బంధువులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని నాగమణి కంటతడి పెట్టడంతో అక్కడున్న అందరి కళ్లూ చెమర్చాయి. దీంతో మంత్రులు, ఇతర అధికారులు ఆమెను ఓదార్చారు. ఊళ్లకు కళొచ్చింది స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనతో చెల్లాచెదురైన గ్రామాలు కోలుకున్నాయి. ఐదు గ్రామాలను అన్నివిధాలా నివాసయోగ్యంగా తీర్చిదిద్దటంతో ప్రజలను వారి ఇళ్లల్లోకి సోమవారం అనుమతించారు. రాత్రి సమయానికి 70 శాతం ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు. క్షేమంగా చేరారు ► ఎల్జీ పాలిమర్స్‌కి ఆనుకుని ఉన్న వెంకటాపురంలో 1,250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే 5 వేల మందిలో 3 వేల మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు షెల్టర్లు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. అస్వస్థతకు గురైన వారు కేజీహెచ్‌లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. ► కంపెనీకి కిలోమీటరు దూరంలో ఉన్న నందమూరి నగర్లో 600 వరకూ ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. వారిలో 70 శాతం మంది సోమవారమే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ► 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ నగర్లో 500 వరకూ ఇళ్లు, 2,200 మంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకున్నారు. మేఘాద్రి గెడ్డ నీరు సురక్షితమే ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ స్టైరీన్‌తో కలుషితమైపోయిందన్న సందేహాలను నివృత్తి చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన నాటి నుంచి రోజూ రిజర్వాయర్ నీటి శాంపిళ్లని పరీక్షల కోసం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ వాటర్ లేబొరేటరీకి పంపించింది. ఈ నెల 7న పంపించిన శాంపిళ్లకు సంబంధించిన నివేదికను జీవీఎంసీకి కాలుష్య నియంత్రణ మండలి అందించింది. తొలి రోజు తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్ మోనోమర్ అవశేషాలు లేవని నివేదికలో పేర్కొంది. నీరు వినియోగించేందుకు సురక్షితంగా ఉందని తెలిపింది. -
బాధితులకు.. సర్కారు ఆపన్నహస్తం
విశాఖ సిటీ: విశాఖలో గురువారం విషవాయువు లీకేజీ ప్రమాదంతో భయాందోళనలకు గురైన స్థానిక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. మొత్తం 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పెందుర్తి, సింహాచలం, గోశాల ప్రాంతాల్లో పలు కల్యాణ మండపాల్లో 20 వేల మందికి సరిపడ సౌకర్యాలను కల్పించింది. ఓ పక్క కరోనా పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రజల యోగక్షేమాలు చూస్తున్నారు. ప్రమాదం తర్వాత వెంకటాపురంలో ఉన్న 1,250 ఇళ్లలో సుమారు 8వేల మందిని, నందమూరినగర్‌లో చెందిన 2,250 మందిని, కంపరపాలెంలో 250 ఇళ్ల నుంచి 1,200 మందిని, పద్మనాభ నగర్లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మెనూ ప్రకారం భోజనం పునరావాస కేంద్రాల్లో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ భోజనం లేదా టిఫిన్ పెడుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారికి అవసరమైన మందులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం, మజ్జిగ, అరటి పండ్లు అందిస్తున్నాయి. ప్రభుత్వం తమకు అన్నివిధాల అండగా ఉందని బాధితులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లోనే భోజనం అందిస్తారు. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మాది పాలిమర్స్ కంపెనీకి సమీపంలో ఉన్న కృష్ణానగర్. గురువారం వేకువజామున విడుదలైన విషవాయువు కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తను నిండు గర్భిణి కావడంతో నాకు కాళ్లు చేతులూ ఆడలేదు. కాసేపటికే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి గోశాలలో ఆశ్రయం కల్పించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. – భారతి, శ్రీను దంపతులు ప్రభుత్వం బాగా చూసుకుంటోంది గ్యాస్ బయటకు రావడంతో ఊపిరి ఆడక అందరం పరుగులు తీశాం. ఇంతలో స్థానిక యువకులు మమ్మల్ని ఆటోలో బయటకు పంపేశారు. అధికారులు బస్సులో ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సమయానికి భోజనం, పిల్లలకు కావల్సిన పదార్థాలు అందిస్తూ బాగా చూసుకుంటోంది. – రాములమ్మ, వెంకటాపురం మాకు ఎలాంటి ఇబ్బందీలేదు గ్యాస్ లీకైన కొద్దిసేపటికే రోడ్డు మీద ఉన్న మమ్మల్ని వెంటనే గోశాలకు తరలించారు. పిల్లాపాపలతో వచ్చినా మాకు ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం అందిస్తున్నాయి. – సింహాచలం, వెంకటాపురం ప్రభుత్వ చేయూత మరిచిపోలేం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు సకాలంలో స్పందించడం వల్లే బతికి బట్టకట్టామని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు చెప్పారు. కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యులు, ఇతర సిబ్బంది తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని వివరించారు. ప్రస్తుతం తామంతా తేరుకున్నామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి ధైర్యం చెప్పడం మర్చిపోలేమన్నారు. బాధితుల మనోగతం వారి మాటల్లోనే.. పాప ఆరోగ్యం కుదుటపడింది ఆస్పత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు సకాలంలో స్పందించడం వల్ల అందరూ బతికారు. – పిల్లి రామలక్ష్మి, అఖిలప్రియ తల్లి వైద్యుల సేవలు మరువలేం నా ఇద్దరు పిల్లలకు కేజీహెచ్‌లో అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి. ప్రభుత్వం, రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించడం వల్ల మరణాలు తగ్గాయి. –భారతి, ఇద్దరు చిన్నారుల తల్లి బతుకుతా అనుకోలేదు ప్రమాదం జరిగిన 8 గంటల తరువాత ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. అసలు బతుకుతాననుకోలేదు. – అంబటి సిద్ధేశ్వరరావు, బాధితుడు సీఎం కృషి వల్లే.. ఆస్పత్రిలో చేర్చిన వారందరికీ మంచి వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కృషి వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. ఆయనకు మా కృతజ్ఞతలు. – దాసరి బిందు, బాధితురాలు -
‘మొండి’ఘటాలపై దూకుడుగా ముందుకు!
సాక్షి, విశాఖపట్నం: 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.350 కోట్లుగా పెట్టుకున్నట్లు మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రకటించింది. ఆ లక్ష్యసాధనకు, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో రెవిన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకూ వివిధ మార్గాల్లో కార్పొరేషన్ ఖజానాకు రూ.226 కోట్లు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చి 31 ఆఖరి రోజు అయినప్పటికీ మార్చి 25 లోపే శతశాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలనే ధృడ నిశ్చయంతో జీవీఎంసీ రెవిన్యూ అధికారులు సమాయత్తమవుతున్నారు. 100 శాతం వసూళ్లు లక్ష్యం... ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులన్నీ వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకోసం నూతన విధానాల్ని అవలంబించాలని కమిషనర్ సృజన, డీసీఆర్ ఫణిరామ్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. చెల్లింపుల విషయంలో కొంతమంది మొండి బకాయిదారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో వారిపై అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తున్నారు. కఠిన చర్యల్లో భాగంగా వివిధ పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 12,000 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ నోటీసుల్లో హెచ్చరిస్తున్నారు. నీటి ఛార్జీలు కట్టకపోతే కుళాయిల కట్ ముందస్తు హెచ్చరికల్లో భాగంగా నిర్ణీత సమయంలో పన్ను చెల్లించని వారికి మంచినీటి నీటి కుళాయి కనెక్షన్లు కట్ చేస్తున్నారు. ముందస్తు నోటీసులు జారీ చేసి.. ఇచ్చిన గడువులోగా ఛార్జీలు చెల్లించాలనీ హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ 3,254 మందికి నోటీసులు జా రీ చెయ్యగా.. 2,501 మంది నీటి పన్ను చెల్లింపులు చేశారు. గ్రేటర్ పరిధిలో 2,11,253 నీటి కనెక్షన్లు ఉండగా.. బకాయిలతో కలిపి మొత్తం 60.68 కోట్లు వసూలు చెయ్యాల్సి ఉంది. మా ర్చి 4వ తేదీ వరకూ రూ.20.08 కోట్లు వసూలైంది. మిగిలిన 40.60 కోట్లని త్వరితగతిన వసూలు చేసేందుకు జీవీఎంసీ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వార్డు అడ్మిన్లకు బాధ్యతలు కమిషనర్ ఆదేశాల మేరకు రెవిన్యూ వసూళ్లలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా చర్యలు చేపట్టాలన్నదే లక్ష్యంగా భావిస్తున్నాం. సచివాలయాల్లో నియమితులైన వార్డు అడ్మినిస్ట్రేటర్లకు బా«ధ్యతలు అప్పగించాం. వారికి కొత్త బాధ్యతలు కాబట్టి.. శిక్షణ ఇచ్చాం. ఒక్కో వార్డు అడ్మిన్‌కి వెయ్యి ఇళ్లు అప్పగించాం. ప్రజలు నిర్దిష్ట కాలంలో పన్నులు చెల్లించి నగరాభివృది్ధకి దోహద పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పన్నులు చెల్లించకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తునాం. – ఫణిరామ్, జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) -
విద్యుత్ సిబ్బంది వికృత హాసం..వృక్ష విలాపం!
హుద్‌హుద్ విపత్తు వేళా మేం ఇంతలా బాధపడలేదు. ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో కూకటి వేళ్లతో సహా నేలకొరిగాం. కొన్నాళ్లకే మళ్లీ సగర్వంగా లేచి నిలబడ్డాం. కానీ.. ఇప్పుడు మమ్మల్ని ఖండ ఖండాలు చేస్తున్న తీరుతో తీవ్రంగా కుంగిపోతున్నాం.వసంత రుతువులో చిగురించాం.. గ్రీష్మంలో చల్లదనాన్ని పంచాం. అదే సమయంలో పచ్చని చెట్లు– ప్రగతికి మెట్లు, హరిత విశాఖ అన్న నినాదాలు వినిపిస్తుంటే.. మాపై మనుషులకు గౌరవం పెరిగిందని సంబర పడ్డాం. లేలేత చిగుళ్లన్నీ ఇప్పుడిప్పుడే ఆకులుగా మారుతున్న తరుణంలో పచ్చదనంతో పరవళ్లు తొక్కుతూ.. పది మందికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుదామనుకున్నాం.ఇంతలోనే విద్యుత్ తీగలకు అడ్డుతగులుతున్నామన్న సాకుతో.. పెంచిన చేతులతోనే మా అంగాంగాలను తెగ నరుకుతున్నారు. ఆక్సిజన్‌తో పాటు నీడనిస్తున్న మమ్మల్ని మోడుల్లా మార్చేస్తున్నారు. మళ్లీ చిగురించి నిలదొక్కుకుంటున్నాం. ఆ ఆనందాన్నీ ఎంతో కాలం అనుభవించనీయకుండా మళ్లీ మళ్లీ మోడులుగా మార్చేస్తున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి విద్యుత్ సిబ్బంది వికృత చేష్టలకు బలైపోతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మేము చేసిన పాపమా..? పర్యావరణాన్ని పరిరక్షించడమే మా పాలిట శాపమా..??..నగరంలో జాతీయ రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏళ్ల వయసున్న వృక్షాల విలాపమిదీ! సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్ సిబ్బంది మెయింటెనెన్స్ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత విశాఖను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్లుగా ఈపీడీసీఎల్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు నగరంలోని చెట్లను నరికేస్తున్నారు. జీవీఎంసీ లేఖలు రాసినా... ఓవైపు పచ్చదనాన్ని పెంచి.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈపీడీసీఎల్ ఇలా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తుండటంపై జీవీఎంసీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్లుగా ఈపీడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. 2017 నుంచి ఈ విషయంలో జీవీఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అప్పటి కమిషనర్ హరినారాయణన్ విద్యుత్ అధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రస్తుత కమిషనర్ సృజన సైతం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుద్‌హుద్ విలయంతో విశాఖలో పచ్చదనం 23 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందనీ.. ఇప్పుడిప్పుడే దాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామంటూ అధికారులకు వివరించినా ఫలితం లేకపోయిందని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారులు వాపోతున్నారు. వాల్టా చట్టం ఏం చెబుతోంది..? పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలి వేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్–2 ప్రకారం నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తూ దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్, టెలికాం, రహదారులు – భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టంలోని సెక్షన్–29 చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇటీవలే జీవీఎంసీ జోన్–3 పరిధిలో దుకాణానికి అడ్డంగా ఉందని చెట్టును నరికేయడంతో సదరు షాపును అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ సంస్థ విషయంలో మాత్రం జీవీఎంసీ ఆ తరహా సాహసం చేయలేకపోతోంది. అయితే గతంలో ఇదే తరహాలో చెట్లను నరికివేయడాన్ని సహించలేకపోయిన జీవీఎంసీ అధికారులు.. నరికేసిన కొమ్మలను ఈపీడీసీఎల్ కార్యాలయాల్లోనే పడేశారు. అయినా వారిలో మార్పు రావట్లేదని జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. తరచూ ఇదే తంతు.. చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా మూడు నాలుగుసార్లు ఈపీడీసీఎల్ అధికారులు మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను గుర్తించి వాటిని కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరికాలి. కానీ నగరంలో మాత్రం నేల నుంచి 3–5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి. గుండె తరుక్కుపోతోంది సీఎం ఆశయాలకు అనుగుణంగా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్రతి మొక్కను ప్రాణంగా పెంచుతున్నాం. అయితే మెయింటెనెన్స్ పేరుతో ఆ చెట్లను ఛిద్రం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. విద్యుత్ అధికారులు జీవీఎంసీకి ఈ బాధ్యత అప్పగించాలి. లేదంటే సమన్వయంతో పనిచేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.– దామోదరరావు,ఉద్యానవన విభాగాధిపతి, జీవీఎంసీ -
‘మహా’ బడ్జెట్..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని 72 వార్డుల ప్రజల్నీ మెప్పించేలా వార్షిక పద్దు తయారు చేసేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి స్మార్ట్ సిటీ మహా బడ్జెట్ సిద్ధమవుతోంది. గతేడాది కంటే ఎక్కువ అంచనాలతోనే వార్షిక బడ్జెట్‌ను అధికారులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అన్ని ప్రాంతాల వారికీ అందేలా.. అంచనాలు వండి వారుస్తున్నారు. 2019–20 ఆర్ధిక సంవత్సరానికి 3,740.65 కోట్ల రూపాయలతో బడ్జెట్ తయారు చెయ్యగా.. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,950 కోట్లతో జంబో పద్దు రానుంది. స్మార్ట్ విశాఖను క్లీన్ సిటీగా, సకల సౌకర్యాల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపైసా ఖర్చు చేసేలా యంత్రాంగం లెక్కలు వేస్తోంది. నగరాభివృద్ధి, ప్రాజెక్టులకు పెద్దపీట.. మహా విశాఖ నగర పాలక సంస్థ 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో కమిషనర్ జి.సృజన ఆచితూచి వ్యవహరిస్తూ వాస్తవ ఆదాయానికి అనుగుణంగా ఉండేలా రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆ«ర్థిక రాజధానిగా చలామణి అవుతున్న విశాఖ నగరం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా... అన్ని ప్రాంతాలలో, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం భారీ కేటాయింపులతో కూడిన బడ్జెట్ తయారవుతోంది. ప్రస్తుత ప్రారంభ నిల్వగా రూ.95 కోట్లు ఉండనుంది. ఇంజినీరింగ్ విభాగానికి సుమారు రూ.1200 కోట్లు, ప్రజారోగ్యానికి రూ.450 కోట్లు, యూసీడీకి రూ.300 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.300 కోట్లు, విద్యకు రూ.100 కోట్లు, ప్రాజెక్టులకు రూ.300 కోట్లు, స్మార్ట్ సిటీకి రూ.300 కోట్లు, లైటింగ్‌కు రూ.100 కోట్లు, పార్కులు, హరిత అభివృద్ధికి రూ.75 కోట్లు... వంతున మొత్తం రూ.3,800 కోట్లు ఖర్చులకు కేటాయించారు. ప్రజలపై భారం లేకుండా.. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా ఎక్కువగా వచ్చే ఆదాయ మార్గాలపై జీవీఎంసీ దృష్టిసారించింది. 010 పద్దు పరిధిలోకి రావడంతో, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ఏటా వెచ్చించే రూ.250 కోట్లు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల పన్నులు, ప్రొఫెషనల్ ట్యాక్స్‌లు, మొండి బకాయిలపై దృష్టి సారించి.. వాటి వసూళ్లని వేగవంతం చేసుకొని కార్పొరేషన్ ఖజానాని నింపాలని భావిస్తున్నారు. మొండి బకాయిలు, ఇతర పన్నుల ద్వారా ఏటా వచ్చే ఆదాయం కాకుండా అదనంగా మరో రూ.100 కోట్లు రాబట్టుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదాయం వృద్ధి రేటు 20 శాతం కంటే ఎక్కువగా ఉండేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. నీటి సరఫరా ద్వారా సుమారు రూ.200 కోట్లు, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ.150 కోట్లు, ఆస్తిపన్ను నుంచి రూ.350 కోట్లు, ఇతర పన్నులు మరో రూ.100 కోట్లు రాబట్టుకోనున్నారు. దీనికి తోడు గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిర్దేశించిన విధంగా రూ. 100 కోట్ల వరకూ రుణాల్ని జీవీఎంసీ పొందనుంది. అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్ కు సంబంధించి రూ.150 కోట్లు, ఏడీబీ రూ.100 కోట్లు, ఎస్సీఎస్పీ నుంచి రూ.100 కోట్లు, టీఎస్పీ నుంచి రూ. 50 కోట్లు, అమృత్‌కు రూ.100 కోట్లు నిధులు రానున్నాయి. మొత్తంగా రూ.4,100 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా జీవీఎంసీ 2020–21 నాటికి కసరత్తులు చేస్తోంది. టీడీపీ హయాంలో అంతా మాయాజాలం..అప్పుల్నీ ఆదాయంగా చూపించిన వైనం గతేడాది తెలుగుదేశం ప్రభుత్వహయాంలో 2018–19ఏడాదికి రూ.3740 కోట్లతో బడ్జెట్ రూపొందించగా. అంతకు ముందు ఏడాదికి రూ.3,292.96 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. అయితే అప్పట్లో అప్పులని కూడా ఆదాయంగా చూపించే పరిస్థితి ఉండేది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను, జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద వచ్చే నిధులను కూడా జీవీఎంసీ ఆదాయంగా లెక్క కట్టే వారు. శివారు ప్రాంతాలపై ప్రధాన దృష్టి.. అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, షాపింగా కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజ్ రెన్యువల్స్, ట్రేడ్ లైసెన్స్‌లు ద్వారా గతేడాది కంటే ఈ సారి ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తూ ఈ ఏడాది మాత్రం దానికంటే రెట్టింపు కేటాయింపులతో మొత్తం రూ.200 కోట్లు అదనంగా వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, ప్రధాన రహదారులకు అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణాలు పెద్ద పీట వేయనున్నారు. అదేవిధంగా విలీన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సృజన భావిస్తున్నారు. ఇంజినీరింగ్ వర్గాల నుంచి అంచనాల కోసం అధికార యంత్రాంగం వేచి చూస్తోంది. మొత్తంగా వచ్చే నెల 15 నాటికి వార్షిక పద్దుకి తుది రూపు ఇచ్చి.. ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు పంపించాలని అధికారులు భావిస్తున్నారు. -
కాగితాలు దాటని రూ.కోట్లు
పనులు.. పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలను నాలుగున్నరేళ్లపాటు తొక్కిపెట్టేసిన టీడీపీ సర్కారు.. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న స్వార్థచింతనతో ఇటీవల ఒక్కసారిగా గేట్లు ఎత్తేసింది. ఎడాపెడా పథకాలు, పనులు ప్రకటించడమే కాకుండా.. శంకుస్థాపన రాళ్లు కూడా వేసేస్తోంది.తాత్కాలిక ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్కారు.. అదే సమయంలో అవసరమున్న.. ఇంతకుముందు నుంచే అమల్లో ఉన్న పనులు, పథకాలను ఎండబెట్టేస్తోంది.కొత్త పనులకు నిధులు విదల్చకపోగా.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటికీ బిల్లులు చెల్లించకుండా కాగితాల్లోనే మురగబెడుతోంది.మహావిశాఖ నగరపాలక సంస్థనే తీసుకుంటే.. పలు పనులకు నిధులు మంజూరు చేసినట్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం.. వాటికి సంబంధించి రూ.252 కోట్లలో ఇప్పటికీ ఒక్కపైసా అయినా రాల్చలేదు..ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల బిల్లులను పెండింగులో పడేసింది.ప్రభుత్వంపై నమ్మకంతో ఇబ్బడిముబ్బడిగా పనులు చేపట్టిన జీవీఎంసీ అధికారవర్గాలు ఖజానాలో కాసుల్లేక కలవరపడుతున్నారు. విశాఖసిటీ: ‘ఏంటో సార్.. పన్నులు వసూలవుతున్నాయే కానీ.. వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్లిపోతోంది. ఒక్క రూపాయి కూడా ఖజానాలో ఉండటం లేదు. వడ్డీ మాఫీ జీవో వచ్చినప్పటి నుంచి పన్నులు చెల్లించే వారు కూడా సమయం ఉందనే దీమాతో చెల్లించడం మానేశారు. ప్రభుత్వమేమో.. జీవో మీద జీవో జారీ చేస్తూ జీవీఎంసీకి కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతోందే తప్ప ఒక్క రూపాయి కూడా అకౌంట్లో వెయ్యడం లేదు. ఇలాగైతే చాలా కష్టమండీ...’ ఇవీ.. జీవీఎంసీలోని ఓ ప్రధానాధికారి అసహనంతో చేసిన వ్యాఖ్యలు. నిజమే.. జీవిఎంసీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజు ఆదాయం ఎంత వచ్చింది? ఏ పనులకు ఎంత చెల్లించాలనే లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వమే. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం ఒకటైతే.. నిధులు మంజూరు చేసినట్లు వరుస జీవోలు జారీ చేస్తున్నా.. వాటికనుగుణంగా పైసా విదల్చకపోవడం మరో కారణం. జీవోలు తప్ప నిధులేవీ? రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జీవీఎంసీ పరిధిలో వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు స్మార్ట్‌సిటీ, అమృత్, ఏడీబీ, ఏబీడీ ప్రాజెక్టుల పనులూ జరుగుతున్నాయి. వీటికి నిధుల విడుదలలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. జీవీఎంసీ విషయంలోనూ అదే మాయ చేస్తోంది. గత ఆరు నెలల్లో సుమారు రూ.252 కోట్లు మంజూరు చేస్తూ పదుల సంఖ్యలో జీవోలు జారీ చేసింది. అయితే ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నిధులు విడుదల చేయాలని జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదు. పెండింగ్ బిల్లులకూ మోక్షం లేదు జీవోల్లో చెప్పిన నిధులే కాదు.. కార్పొరేషన్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లుల మంజూరులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు పూర్తి చేసి బిల్లుల కోసం నివేదికలు పంపినా స్పందించడం లేదు. అకౌంట్స్ ఫ్రీజింగ్లో ఉండటం వల్ల బిల్లులు మంజూరు కావడం లేదని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటికే పెండింగులో ఉన్న రూ.46 కోట్లు చెల్లించాలని గత ఆరు నెలలుగా కోరుతున్నా ఫలితం లేకపోతోంది. పన్ను రాలడం లేదు..? జీవీఎంసీ ప్రధాన ఆదాయ వనరులైన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో నగరంలో పలు పనులు చేపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పన్నుల వసూళ్లలో మొదట్లో వేగం పెంచిన జీవీఎంసీ.. ఒక్కసారిగా చతికిలపడింది. బకాయిలున్న ఆస్తి పన్నులకు సంబంధించి వడ్డీ మాఫీ చేస్తూ సర్కారు జీవో జారీ చేయడంతో పన్ను చెల్లింపులు నిలిచిపోయాయి. మార్చి 31 వరకూ సమయం ఉండటంతో ఆలస్యంగా చెల్లించినా ఫర్వాలేదనుకుంటూ చాలా మంది నగర వాసులు పన్నులు చెల్లించడం మానేశారు. వడ్డీ ద్వారా వచ్చే సుమారు 20 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ జీవో వల్ల కార్పొరేషన్ కోల్పోయింది. దీంతో కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దిగజారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనూ ఇదే తీరు నమ్మించి మోసం చెయ్యడం ప్రభుత్వానికి కొత్త కాదు. జీవీఎంసీకి కుచ్చుటోపీ పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. 2014లో హుద్‌హుద్ ధాటికి ధ్వంసమైన నగర పునర్నిర్మాణానికి జీవీఎంసీ నిధులు ఖర్చు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్కారు ఆదేశాల మేరకు వివిధ అభివృద్ధి పనులకు మొత్తం 21,78,04,314 రూపాయల మేర ఖర్చు చేసి.. ఆ వివరాలతో జీవీఎంసీ నివేదిక పంపింది. దీనికి స్పందించిన ప్రభుత్వం నెల రోజుల్లో రూ.7.35 కోట్లు.. మూడేళ్ల తర్వాత మరో 7 కోట్లు విడుదల చేసి.. వాటితోనే సర్దుకుపోవాలని చెప్పినట్లు గ్రేటర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతూ.. ఒక్కో నియోజకవర్గంలో రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు రూ.50 కోట్ల విలువైన పనులు చేపట్టి.. ఆ నిధులను మంజూరు చేయాలని జీవీఎంసీ నివేదించింది. అయితే సర్కారు రూ.25 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఐదేళ్ల తలసరి ఆదాయం రూ.40 కోట్లు, నాన్ ప్లాన్ గ్రాంటు రూ.100 కోట్లు కూడా ఇవ్వకుండా జీవీఎంసీని ఆర్థికంగా తొక్కేస్తోందని ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గాజువాక ఎమ్మెల్యేకు పరాభవం
విశాఖపట్నం, గాజువాక: టీడీపీ ప్రదర్శించిన విగ్రహ రాజకీయానికి జీవీఎంసీ అధికారులు చెక్ చెప్పారు. టీడీపీ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి తండ్రి, ఉక్కు నిర్వాసిత నాయకుడు భూలోకరెడ్డి విగ్రహాన్ని పెదగంట్యాడలో ఏర్పాటు చేస్తున్న సమయంలో జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి స్వయంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చి అధికారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. తాను లేఖ ఇస్తానని, విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని ఎమ్మెల్యే కోరినా ‘ఆ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడుకోండ’ని చెప్పడంతో చేసేదిలేక వెనుదిరిగారు. పెదగంట్యాడ జంక్షన్ బీసీ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గాజువాక మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది. విగ్రహ ఏర్పాటు జాప్యం కావడంతో అదే స్థలంలో భూలోకరెడ్డి విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు పదేళ్ల క్రితం రాత్రికి రాత్రే పెట్టేశారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఆ విగ్రహానికి అధికారులు ముసుగు వేసేశారు. విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించాలని, అంబేడ్కర్ విగ్రహమే ఉండాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టలేకపోయారు. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు పెదగంట్యాడ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి చెవులు, ముక్కు తొలగించి ఇటీవల ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకు దిగిన దళితులకు అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి సంఘీభావం లభించింది. అయితే ఆ సానుభూతిని తనవైపు తిప్పుకోవాలని ఎమ్మెల్యే భావించి, ఆందోళన విరమిస్తే న్యాయం చేస్తానని చెప్పారు. భూలోకరెడ్డి విగ్రహాన్ని తొలగించి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆందోళన విరమిస్తామని వారు తెగేసి చెప్పారు. దీంతో పులి వెంకట రమణారెడ్డితో చర్చించిన ఎమ్మెల్యే.. భూలోకరెడ్డి విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించి, నిర్వాసిత భవనం వద్ద ఏర్పాటు చేసుకొనేందుకు ఒప్పించారు. దగ్గరుండి ఆ విగ్రహాన్ని తొలగించి నిర్వాసిత భవనం వద్దకు తరలించారు. దాన్ని సోమవారం ఏర్పాటు చేస్తుండగా అక్కడికి చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీదేవి అడ్డుకున్నారు. కొత్తగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే పల్లా అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఏసీపీ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎంత ప్రయత్నించినా అధికారులు ససేమిరా అనడంతో చేసేది లేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది. భూలోకరెడ్డి విగ్రహాన్ని మూడ్రోజుల క్రితం తొలగించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మాట మార్చారని దళితవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసిన తరువాతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్టు పేర్కొంటున్నారు. ఈ ఉదంతంతో అటు టీడీపీ శ్రేణుల్లోను, ఇటు దళితవర్గాల్లోను ఎమ్మెల్యే పరువు పోగొట్టుకున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తగ్గిన 'పన్ను' పోటు
జీఎస్టీ అమల్లోకి వచ్చాక గూబ గుయ్యిమనించిన పన్ను పోటుతో సతమతమైన జీవీఎంసీకి కాస్త ఊరట లభిం చింది. నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులపై పన్ను రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ పర్యవేక్షక మండలి సర్క్యులర్ జారీ చేసింది. విశాఖసిటీ: మహా విశాఖ నగర పాలక సంస్థకు జీఎస్టీ నుంచి కొంత ఊరట లభించింది. అభివృద్ధి పనులపై 18 శాతం శ్లాబులో ఉంచిన ప్రభుత్వం తాజాగా 12 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని ప్రాజెక్టులకూ 5 శాతం వ్యాట్.. మరో 5 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండేది. స్థానిక సంస్థలు ఏవీ ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించేవి కాదు. అంటే.. కేవలం 5 శాతం వ్యాట్ మాత్రమే పన్ను రూపంలో ప్రాజెక్టు నిధుల నుంచి వెళ్లేవి. ఇప్పుడు జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో.. ఈ ప్రాజెక్టులపై ఏకంగా.. 18 శాతం చెల్లించాల్సి వస్తోంది. అంటే 13 శాతం అదనపు భారం పడుతుండడంతో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజా ఆదేశాలతో భారం తగ్గనుంది. 18 శ్లాబులో ఉంటే ఏడాదికి రూ.250 కోట్ల పనులు పూర్తి చేస్తే రూ. 45 కోట్ల జీఎస్టీకి చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు 12 శాతం శ్లాబులోకి తీసుకురావడంతో రూ.30 కోట్లు మాత్రమే భారం పడనుంది. దీంతో కొంత మేర ఉపశమనం లభించిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు
ఏలేరులో అడుగంటిన జలాలు ఇతర రిజర్వాయర్లలో పరిస్థితి ఆందోళనకరం విశాఖ సిటీకి పొంచి ఉన్న వేసవి గండం వచ్చేనెల నుంచే కష్టాలు మొదలు విశాఖపట్నం ఈసారి వేసవి పేరు చెబితే చాలు జీవీఎంసీ అధికారులు చమటలు పడుతున్నాయి. సిటీలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతుండడం వారిని కలవరపెడుతోంది. పైకి ఇబ్బంది లేదంటూ చెప్పుకొస్తున్న నీటిమట్టాలు మాత్రం భయపెడుతున్నాయి. జీవీఎంసీ జనాభా 22 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సిటీ పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది. ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడస ర్లోవ రిజర్వాయర్లు. ప్రస్తుతం వీటిలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు సామర్ధ్యం 24.11 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 5.8 టీఎంసీలు మాత్రమే ఉంది. అది కూడా గోదావరి నుంచి లిఫ్టింగ్ చేస్తున్నారు. మరో పక్క గోదావరిలో కూడా ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో ధవళేశ్వరం రిజర్వాయర్ కింద నీటి నిల్వలు ఊహించని రీతిలో తగ్గుతున్నాయి. ఈ ప్రభావంతో మరో నెలరోజుల్లోనే ఏలేరులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ప్రతి రోజు గోదావరి నుంచి 100 క్యూసెక్కులు, ఏలేరు నుంచి 100 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఏలేరు జలాశయం నుంచి నగరానికి రోజుకు 130 మిలియన్ గ్యాలన్ల నీరు వస్తున్నప్పటికీ 60 ఎంజీడీల వరకు వృథాగా పోతుంది. ప్రజలకు సరఫరా చేసే నీటిలో ఐదారు మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతుందని అంచనా. మరోపక్క విశాఖ సిటీకి తాగునీటి అవసరాలు తీర్చే మిగిలిన రిజర్వాయర్లలో కూడా నీటి మట్టాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ఇన్‌ఫ్లో లేకపోవడంతో మార్చిలో గోదావరిలో నీటి నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శివారు గ్రామాల్లో వాటర్‌ట్యాంక్‌ల ద్వారా తాగునీరు రోజు ఒకపూట రావడం కూడా కష్టంగా మారింది. ఇక కుళాయిల ద్వారా రెండుపూటలా వస్తున్నా కొన్నిచోట్ల అరగంటకు మించి రావడం లేదు. సమస్యాత్మక ప్రాంతాలు గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది, పెందుర్తి, చినముషిడి వాడ, అడవివరం, సింహాచలం, దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు మంచినీటి సరఫరా విభాగం టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు నాలుగు ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఏటా వేసవిలో 10 నుంచి 15 వరకు అద్దెకు తీసుకుంటుంటారు.