ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి | Road Accident At Sangareddy ORR | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

Feb 7 2026 7:26 PM | Updated on Feb 7 2026 7:43 PM

Road Accident At Sangareddy ORR

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్‌ఆర్‌పై అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో​ చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్‌ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement