
కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా పది జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటుకు టీ. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 'తెలంగాణ కదం యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాంతో పోలీసులతో తెలంగాణ జేఏసీ నేతల వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేసినవారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జేఏసీ, శేరిలింగంపల్లి జేఏసీల ఆధ్వర్యంలో నేటి నుంచి మూడురోజుల పాటు శేరిలింగంపల్లి నుంచి యాదగిరిగుట్టకు ‘తెలంగాణ కదం’ పేరుతో చేపట్టనున్న కాలినడక యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.