ఉగ్రవాదులు, పోలీసుల మధ్య భీకర కాల్పులు | Gunmen in Army Uniform Attack Police Station in Punjab | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులు, పోలీసుల మధ్య భీకర కాల్పులు

Published Mon, Jul 27 2015 8:28 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

స్టేషన్ కు సమీపంలో పోలీసులు, స్థానికుల హడావుడి - Sakshi

స్టేషన్ కు సమీపంలో పోలీసులు, స్థానికుల హడావుడి

గుర్దాస్పూర్: నల్లగొండ జిల్లా జానకీపురం.. ముంబై 26/11 తరహాలో ఉగ్రవాదులు మరో దాడికి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు పంజాబ్లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో గార్డు డ్యూటీ చేస్తోన్న ఇద్దరు పోలీసులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వేరొక ప్రాంతంలో ఓ తెలుపు రంగు మారుతీ కారును దొంగిలించి దానిలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన దుండగులు దిగీదిగడమే కాల్పులు ప్రారంభించారు. గార్డులను చంపి స్టేషన్ ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దుండగులు, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. హై అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ సంఘటన చోటుచేసుకున్న దీననగర్.. పాకిస్థాన్  సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం, ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు ఉండటం గమనార్హం. దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement