Army Uniform
-
ఆర్మీ జవాన్ మృతి.. సైనిక దుస్తుల్లో నాన్నకు సెల్యూట్
సాక్షి, బెంగళూరు: సైన్యంలో పనిచేసే కన్నతండ్రికి సైనిక దుస్తుల్లో నివాళులర్పించిన చిన్నారి తనయుడు అందరినీ కంటతడి పెట్టించాడు. నాగాల్యాండ్‌లో ఆర్మీ జీపు బోల్తా పడి కర్ణాటకలో బెళగావి జిల్లా శివపురకు చెందిన ఆర్మీ జవాన్ (డ్రైవర్) మంజునాథ గౌడన్నవర మరణించారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆర్మీ యూనిఫాంలో ఆయన తనయుడు స్వరూప్ (5) సెల్యూట్ చేస్తుండగా ఓదారుస్తున్న బెళగావి ఎంపీ మంగళా అంగడి. బాలున్ని ఆ పరిస్థితిలో చూసిన గ్రామస్తుల మనసులు చలించాయి. -
ఎన్నికల ర్యాలీకి ఏకంగా ఆర్మీ డ్రెస్‌లో..!
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి మిలిటరీ దుస్తులు ధరించి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని యమునా విహార్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని మిలిటరీ దుస్తుల్లో వచ్చిన మనోజ్ తీవారి జెండా ఊపి ప్రారంభించారు. తీవారి తీరుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓట్లు అడుక్కోవడానికి ఆర్మీ దుస్తులు వాడుకోవడం సిగ్గుచేటు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘సిగ్గుచేటు. ఓట్లు అడగడానికి మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్‌ను వేసుకసున్నారు. బీజేపీ, మోదీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారు. అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారు‘ అని డెరెక్ ట్వీట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తీవారి వివరణ ఇచ్చారు. ‘మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉంది. అందుకే ఆర్మీ దుస్తులు ధరించాను. నేను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా.. ఈవిధంగా నా సంఘీభావం తెలియజేశాను. ఇలా చేయడం అవమానించడం ఎలా అవుతుంది? నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్లాల్ నెహ్రూను అవమానించినట్టేనా’ అని తివారీ ట్విటర్లో ఎదురుప్రశ్నించారు. -
ఉగ్రవాదులు, పోలీసుల మధ్య భీకర కాల్పులు
గుర్దాస్పూర్: నల్లగొండ జిల్లా జానకీపురం.. ముంబై 26/11 తరహాలో ఉగ్రవాదులు మరో దాడికి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో గార్డు డ్యూటీ చేస్తోన్న ఇద్దరు పోలీసులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వేరొక ప్రాంతంలో ఓ తెలుపు రంగు మారుతీ కారును దొంగిలించి దానిలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన దుండగులు దిగీదిగడమే కాల్పులు ప్రారంభించారు. గార్డులను చంపి స్టేషన్ ను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దుండగులు, పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. హై అలర్ట్ ప్రకటించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన చోటుచేసుకున్న దీననగర్.. పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం, ఆ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ కీలక స్థావరాలు ఉండటం గమనార్హం. దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.