24 మంది క్రైస్తవుల కాల్చివేత
కైరో: ఈజిప్టులో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. విచక్షణ లేకుండా ఓ బస్సుపై కాల్పులతో మారణకాండ సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్ అన్బా శామ్యూల్ మొనాస్టరీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది అక్కడికక్కడే చనిపోగా 25మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దేశంలోని కోప్టిక్ క్రైస్తవులపై గత కొంతకాలంగా ఐఎస్‌ఐ తీవ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌లో రెండు చర్చిలపై జరిగిన బాంబు దాడుల్లో 46 మంది చనిపోయారు.