టీడీపీ ఎంపీ గన్‌మెన్‌ భార్య ఆత్మహత్య | TDP MP Shiva Prasad Gunmen Ramana Wife Committed Suicide In Madanapalle | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ గన్‌మెన్‌ భార్య ఆత్మహత్య

Published Wed, Oct 10 2018 1:15 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

TDP MP Shiva Prasad Gunmen Ramana Wife Committed Suicide In Madanapalle - Sakshi

గన్‌మెన్‌ వెంకటరమణ భార్య సరస్వతి

గతంలో కూడా వెంకటరమణ తన భార్య సరస్వతిని సర్వీస్‌ గన్‌తో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి

సాక్షి, మదనపల్లె: చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్‌. శివప్రసాద్‌ గన్‌మెన్‌ వెంకటరమణ భార్య సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బాలాజీనగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో కూడా వెంకటరమణ తన భార్య సరస్వతిని సర్వీస్‌ గన్‌తో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మదనపల్లె తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement