అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ శ్రేణుల టాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడి చేశారని ఆయన గన్మెన్ చెప్పారు.
కాకినాడ: అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ శ్రేణుల టాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడి చేశారని ఆయన గన్మెన్ చెప్పారు. ఆ దాడిని అడ్డుకునేందుకు వెళితే తనపై దాడి చేశారని, చేతిలో గన్ తీసుకునేందుకు ప్రయత్నించారని, తన చొక్కాను కూడా చింపేశారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేపై దాడి చేస్తుంటే అడ్డుకోవడం తప్పా అని గన్ మెన్ ప్రశ్నించారు.
ప్రస్తుతం స్వల్పంగా గాయపడిన ఎమ్మల్యే దాడిశెట్టి రాజా, గన్మెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిని మరో వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. టీడీపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబునాయుడు ప్రోద్బలం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అక్రమ ఇసుక తవ్వకాల్లో కూడా ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు.