
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి
అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు.
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శుక్రవారం ఉదయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాడ్లు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా ఫ్లెక్సీల ఏర్పాటు నేపథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్య వివాదం ఏర్పడినట్లు సమాచారం. వైఎస్‌ఆర్ సీపీకి మద్దతు ఇచ్చినందుకే తమపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ప్రతిఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడ‍్డారు.