వైఎస్‌ఆర్సీపీ కార్పొరేటర్‌ పై హత్యాయత్నం | tdp leadar b tech ravi followers attack on ysrcp corporator | Sakshi

వైఎస్‌ఆర్సీపీ కార్పొరేటర్‌ పై హత్యాయత్నం

Published Mon, Feb 27 2017 1:24 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి టీడీపీ హత్యా రాజకీయాలకు తెగబడుతోంది.

కడప: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి టీడీపీ హత్యా రాజకీయాలకు తెగబడుతోంది. కడప 46 డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ పై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి వర్గీయులు సోమవారం దాడి చేసి హతమార్చేందుకు యత్నించారు. ఇనుప రాడ్లు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో సురేష్‌ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేష్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆ వెంటనే ఆయన సొంత గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు గత కొంత కాలంగా సురేష్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
గతంలో ఇంటి వద్ద స్కార్పియోలో నిఘా పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదే అంశాన్ని గమనించి గతంలో జిల్లా ఎస్పీకి కూడా తనకు ప్రాణహాని ఉందంటూ సురేష్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విన్నవించారు. రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అయినా టీడీపీ ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. కడప కార్పొరేషన వద్ద ఉన్న సురేష్ పై బీటెక్ రవి వర్గీయులు దారుణంగా దాడిచేశారు. డిఎస్పీ కార్యాలయం పక్కనే ఈ దాడి జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement