కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం | tdp leaders attac on ysrcp leaders in doan muncipality | Sakshi
Sakshi News home page

కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం

Published Sat, Mar 25 2017 3:29 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం - Sakshi

కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం

ఏపీలో  వైఎస్సార్‌సీపీ వర్గీయులపై  దౌర్జన్యకాండ
డోన్‌ టౌన్‌(డోన్‌): మున్సిపల్‌ మార్కెట్‌ వేలంలో పాల్గొనేం దుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు.  ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం దిన, వారం కూరగాయల మార్కెట్‌ వేలం పాటలను నిర్వహిం చారు.

తమకు పోటీగా వేలం పాటల్లో పాల్గొంటున్నారనే అక్కసుతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కేశన్నగౌడ్, అతని అనుచరులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడిచేశారు. వారిని చర్చల పేరిట పిలిపించి.. తీవ్రంగా గాయపర్చారు.  అయితే పోలీసులు వీరికి బందోబస్తుగా ఉన్నారే తప్ప అదుపులోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేలం ముగిసిన తర్వాత పోలీసులు తీరిగ్గా వీరిని పోలీసు స్టేషన్‌కు తరలించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement