
సాక్షి, కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది. కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్‌డీఓ చక్రపాణిని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment