ఇంట్లోకి చొరబడి కాల్చిచంపాడు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోపోర్ పట్టణంలోని సైద్పురా ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగుడు నేరుగా ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో ఫయాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు ఎందుకు జరిపాడు అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.