Civilian
-
తొలిసారిగా అంతరిక్షంలోకి సాధారణ పౌరుడు!
చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తన దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని బీచింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రోఫెసర్, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావో, మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్ జియాంగ్ వెల్లడించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి టేకాఫ్ కాబోతున్నాయని మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది. అయితే ఈ మిషన్‌లో గుయ్ అంతరిక్ష శాస్త్ర ప్రయోగాత్మక పేలోడ్ల ఆన్-ఆర్బిట్ ఆపరేషన్‌కు ప్రధానంగా బాధ్యత వహించగా, మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, క్రూ సిబ్బంది ఝు యాంగ్జు ఈ యాత్రని పర్యవేక్షిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో అంతరిక్ష యాత్ర కల కోసం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతేగాదు ప్రపంచంలో రెండోవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా తన మిలటరీ రన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఎప్పటికైనా మానవులను చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయమై రష్యా, యూఎస్‌లో పోటీ పడేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే చైనా కూడా చంద్రునిపై స్థావరాన్ని నిర్మించాలని భావింస్తుంది. అంతేగాక 2029 నాటికి సిబ్బందితో కూడిన చంద్ర మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. (చదవండి: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!: అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించిన ఇమ్రాన్ ఖాన్) -
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం!
అబుదాబి : యుఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్‌తో శనివారం సత్కరించింది. 2015లో అరబ్ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్‌లోనే యూఏఈ ప్రకటించింది. ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరుతో ఇస్తారు. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం విశేషం. ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 60 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. యుఏఈ భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అలాగే యుఏఈ పెట్రోలియం ఉత్పత్తుల్లో భారత్ నాలుగో అతిపెద్ద దిగుమతిదారు. భారతదేశం నుంచి దాదాపు 33 లక్షల మంది యుఏఈలో పని చేస్తున్నారు. -
పాక్ కాల్పుల్లో తెలంగాణ జవాను మృతి
చింతలమానెపల్లి(సిర్పూర్): కశ్మీర్లో సరిహద్దు వెంట సోమవారం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన రాజేశ్ దక్వా(40) అనే హవల్దార్ వీరమరణం పొందారు. తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ గ్రామం రాజేశ్ స్వస్థలం. శ్రీనగర్ పరిధిలోని డోండా జిల్లా ఆర్ఆర్ రెజిమెంట్4లో విధులు నిర్వర్తిస్తుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. రాజేశ్ 1997లో సైన్యంలో సైనికుడిగా చేరారు. తదనంతరం హవల్దార్‌గా పదోన్నతి పొందారు. ఆయనకు భార్య జయ, కుమార్తెలు రోహిణి, ఖుషి ఉన్నారు. తండ్రి మణిహోహన్ గతంలో మరణించారు. రాజేశ్ తల్లి లతిక సొంతూరులోనే చిన్న హోటల్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. రాజేశ్ పార్థివదేహాన్ని శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ అధికార లాంఛనాలు పూర్తిచేసి సొంతూరుకు తరలించనున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల కారణంగా మృతదేహం స్వస్థలానికి తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మృతదేహాన్ని బుధవారం రాత్రి లేదా గురువారం రవీంద్రనగర్‌కు తరలించే అవకాశం ఉంది. సంఘటన నేపథ్యంలో చింతలమానెపల్లి మండలం, జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వీర జవాను!
-
ఇంట్లోకి చొరబడి కాల్చిచంపాడు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోపోర్ పట్టణంలోని సైద్పురా ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగుడు నేరుగా ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో ఫయాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు ఎందుకు జరిపాడు అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ బాంబుల మోతతో దద్దరిల్లింది. చుట్టుదట్టమైన పొగలు దుమ్ముధూళి అలుముకొని కారుమబ్బులు నేలపై పరుచుకున్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా గోడలకు, వీధులకు రక్తపు చారికలు అంటుకున్నాయి. ఎంతోమంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రస్తుతం రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడులే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా రష్యా భారీ మొత్తంలో బాంబులను, రాకెట్ లను డెమాస్కస్ పై విడవడంతో దాదాపు 40మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఎంతోమంది గాయాలపాలయ్యారు. బాంబుల ధాటికి నివాసాలన్నీ కూడా ధ్వంసమై వాటిల్లో సామాన్య జనం చిక్కుకుపోయారు. లోపల ఉంటే ఇళ్లు కూలతాయో, బయటకు వస్తే బాంబులు పడతాయేమోనన్న భయంతో డెమాస్కస్ ప్రజలు బిక్కుమంటున్నారు. బుడిబుడినడకలు వేసే చిన్నారులు సైతం ప్రాణ భయంతో వీధుల వెంట పరుగెడుతుండటం పలువురుని కంటతడిపెట్టిస్తోంది. కాగా, తాము పౌర నివాసాలపై దాడులు చేయలేదని, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొనే దాడులు జరిపామని రష్యా ప్రకటించింది. తమపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. -
జమ్మూకాశ్మీర్‌లో ఎన్కౌంటర్
-
ఎన్కౌంటర్లో పౌరుడి మృతి
శ్రీనగర్: కశ్మీర్లో సైనికులకు, మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ప్రాణాలు కోల్పోతున్న సాధారణ పౌరుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి సైనిక బలగాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ పౌరుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ పోలీస్ అధికారి అందించిన వివరాల ప్రకారం కుల్లాంగ జిల్లా రెద్వానీ బాలా గ్రామంలో జరిగిన హోరాహోరీ పోరులో అవిఫ్ రషీద్ అనే వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. బిలాల్ అహ్మద్ అనే మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి ఆందోళన చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా కోపోద్రిక్తులైన ఆందోళన కారులు సైనిక బలగాలతో ఘర్షణకు దిగిన రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కాల్పుల్లో జవాను మృతి
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. కేర్నపాల్ నుంచి కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మహేంద్రప్రతాప్యాదవ్ అనే హెడ్‌కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని జగదల్పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందాడు. -
మళ్లీ తెగబడిన పాకిస్తాన్
-
మళ్లీ తెగబడిన పాకిస్తాన్
సరిహద్దుల్లోని 13 ఔట్ పోస్టులపై భారీగా కాల్పులు జమ్మూ: కొంతకాలంగా తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్.. మళ్లీ తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై పాకిస్తాన్ బలగాలు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాయి. గత ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. అయితే పాకిస్తాన్ బలగాలకు భారత సేనలు దీటుగా బదులిచ్చాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ రేంజర్లు మృతిచెందినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ దళాలు బుధవారమే విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారత దళాలు దీటుగా స్పందించి, ఎదురుకాల్పులు జరపడంతో... పాకిస్తాన్‌కు చెందిన నలుగురు రేంజర్లు కూడా మరణించారు. ఇది జరిగిన కొద్ది గంటలలోపే పాక్ దళాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. బుధవారం రాత్రంతా సాంబా సెక్టార్‌లోని 13 సైనిక ఔట్‌పోస్టులపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ వెల్లడించారు. దీనికి ప్రతిగా బీఎస్ఎఫ్ దళాలు కూడా కాల్పులు జరిపాయని... గురువారం ఉదయం 6 గంటల వరకు కాల్పులు కొనసాగాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో గట్టిగా ప్రతిస్పందిస్తామన్నారు. అయితే ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌లోకి చొరబడడానికి అంతర్జాతీయ సరిహద్దు వద్ద యాభై, అరవై మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని రాకేశ్‌శర్మ చెప్పారు. సరిహద్దుల వెంట భారత భూభాగంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. -
మీ నాన్న లేడమ్మా...
దేశ సరిహద్దులో పాక్ దళాల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి స్వగ్రామం తూపల్లిలో విషాద చాయలు కన్నీరు మున్నీరైన భార్య అపర్ణ రెండేళ్ల కూతురును పట్టుకుని గుండెలవిసేలా రోదన కదిరి: ‘మా నాన్న వస్తాడు.. నాకు కొత్త బట్టలు తెస్తాడు.. టపాకాయలు తెస్తాడు.. ఊరందరికీ పంచుతానని చెప్పావే.. ఇంకెక్కడ మీ నాయన తల్లీ.. మీ నాన్న చచ్చిపోయాడంట.. ఇంగ మనకు దిక్కెవరు? నీకు నేను.. నాకు నువ్వు.. మనిద్దరమే మిగిలిపోతిమి.. మా నాన్న తుపాకీ పట్టుకుని దొంగోళ్లను తరిమేస్తాడని ముద్దు ముద్దుగా చెప్పితివి కదే.. ఇపుడు ఆ పాకిస్తాన్ దొంగేళ్లే దొంగచాటున కాల్చేశారే.. ఓరి దేవుడా.. మాకు ఇంత అన్యాయం చేశావేమిరా..’ అంటూ భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అనిల్‌కుమార్‌రెడ్డి(31) భార్య అపర్ణ తన రెండేళ్ల చిన్నారి త్రిపురను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. తలుపుల మండలం తూపల్లికి చెందిన ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు ధనుంజయ్‌రెడ్డి, రెండో కొడుకు సుదర్శన్‌రెడ్డి వీరిద్దరూ స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. మూడో కొడుకు అనిల్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుండి తాను సైన్యంలో చేరి దేశం కోసం పోరాటం చేయాలంటుండేవాడు. తాను అనుకున్నట్లు గానే 2003లో బీఎస్ఎఫ్ జవానుగా చేరారు. విధి నిర్వహణలో అందరికంటే ముందుండే వాడని సహచరులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి పూంచ్ సెక్టార్లో ఉన్నట్లుండి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభం కావడం.. అనిల్ దేహంలో బుల్లెట్లు చొచ్చుకు పోవడం ఊహించని రీతిలో జరిగిపోయిందని తోటి జవాన్ల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. ‘జై భారత్.. జైజై భారత్’ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు వదిలాడని వారు చెప్పారు. ఇతను నాలుగేళ్ల క్రితం ధర్మవరం మండలం కనంపల్లికి చెందిన అపర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల త్రిపుర అనే కుమార్తె ఉంది. ‘దీపావళి పండుగకు సెలవు దొరికింది. నేను ఊరికి వస్తాను. నిన్ను, నా కూతురును, మా అమ్మా, నాన్నను చూడాలని ఉంది’ అని రెండు రోజుల క్రితమే అతను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి బాధ వర్ణణాతీతం. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. మృతదేహం చేరుకునే సమయాన్ని బట్టి శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు ని ర్వహిస్తారని బంధువులు తెలిపారు. అనిల్ మృతిపై కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, తలుపుల సింగిల్ విండో అధ్యక్షుడు పూల శ్రీనివాసరెడ్డి, పలువురు స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు.