బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు | Russian airstrikes continue in Syria, civilians caught in crossfire | Sakshi
Sakshi News home page

బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు

Published Tue, Dec 15 2015 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు

బాంబులతో దద్దరిల్లిన డెమాస్కస్.. చిన్నారుల కేకలు

డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్ బాంబుల మోతతో దద్దరిల్లింది. చుట్టుదట్టమైన పొగలు దుమ్ముధూళి అలుముకొని కారుమబ్బులు నేలపై పరుచుకున్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా గోడలకు, వీధులకు రక్తపు చారికలు అంటుకున్నాయి. ఎంతోమంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రస్తుతం రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడులే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఏరివేసే చర్యల్లో భాగంగా రష్యా భారీ మొత్తంలో బాంబులను, రాకెట్ లను డెమాస్కస్ పై విడవడంతో దాదాపు 40మంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. ఎంతోమంది గాయాలపాలయ్యారు.

బాంబుల ధాటికి నివాసాలన్నీ కూడా ధ్వంసమై వాటిల్లో సామాన్య జనం చిక్కుకుపోయారు. లోపల ఉంటే ఇళ్లు కూలతాయో, బయటకు వస్తే బాంబులు పడతాయేమోనన్న భయంతో డెమాస్కస్ ప్రజలు బిక్కుమంటున్నారు. బుడిబుడినడకలు వేసే చిన్నారులు సైతం ప్రాణ భయంతో వీధుల వెంట పరుగెడుతుండటం పలువురుని కంటతడిపెట్టిస్తోంది. కాగా, తాము పౌర నివాసాలపై దాడులు చేయలేదని, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొనే దాడులు జరిపామని రష్యా ప్రకటించింది. తమపై చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement