
కారు బాంబు పేలుడు: ఐదుగురు మృతి
సోమాలియా: సోమాలియా రాజధాని మొగదీషులో కారు బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.
నగరంలోని ప్రధాన రహదారి మక్కా అల్ ముక్కారమలోని పనోరమా బార్ సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు.