సోమాలియాలో తీవ్రవాదుల దాడి: 25 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో శుక్రవారం తీవ్రవాదులు రెచ్చిపోయారు. హోటల్లపై బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మొగాదీషు డిప్యూటీ మేయర్తో ఎంపీ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
హోటల్పై తీవ్రవాదులు బాంబు దాడి ప్రారంభించగానే కారు బాంబు, ఆత్మాహుతి దాడి చేసుకున్నారని వివరించారు. కాగా సైన్యం ఘటన స్థలానికి చేరుకుని తీవ్రవాదులపైకి కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని... అయితే తీవ్రవాదుల దాడిలో హోటల్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని విశదీకరించారు. శుక్రవారం నేపథ్యంలో హోటల్ లో మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా ప్రార్థనలో ఉన్నారని చెప్పారు. దేశాధ్యక్షుడు భవనానికి సమీపంలో ఈ హోటల్ ఉంది. ఈ దాడికి పాల్పడింది ఆల్ ఖైదా అనుబంధ సంస్థ షిబాబ్ ప్రకటించింది.