ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి | Suicide bomber kills 16 in Somali, al Shabaab claims responsibility | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి

Published Sun, Oct 20 2013 10:26 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

Suicide bomber kills 16 in Somali, al Shabaab claims responsibility

సోమాలియా దేశ సరిహద్దుల్లోని బలద్వీని పట్టణంలో నిన్న ఓ హోటల్లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 16 మంది మృతి చెందారని స్థానిక నాయకుడు ఆదివారం వెల్లడించారు.ఆ ఘటనలో మరో 33మంది గాయపడ్డారని తెలిపారు. వారంతా పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

 

సైనికులు,స్థానిక పౌరులతో కిటకిటలాడుతున్న హోటల్లోకి బాంబు ధరించిన వ్యక్తి ప్రవేశించి, చూస్తుండగానే తనకు తాను పేల్చేసుకున్నాడని చెప్పారు. ఆ దాడికి పాల్పడింది తామేనని ఆల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ అని ప్రకటించింది.  ఇథియోపియా సరిహద్దు ప్రాంతాల్లోని స్థానికులు, విదేశీ సైనికులపై అల్ ఖైదా సంస్థకు చెందిన తీవ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement