మిలిటెంట్‌ అనుకుని మంత్రిని కాల్చేశారు | Somalia minister shot dead in car after being mistaken for militant: Police | Sakshi
Sakshi News home page

మిలిటెంట్‌ అనుకుని మంత్రిని కాల్చేశారు

Published Thu, May 4 2017 7:38 PM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

మిలిటెంట్‌ అనుకుని మంత్రిని కాల్చేశారు

మిలిటెంట్‌ అనుకుని మంత్రిని కాల్చేశారు

మొగదీషు(సోమాలియా): మిలిటెంట్‌ అనుకుని పొరబడి ఓ మంత్రిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ సంఘటన సోమాలియా దేశంలో చోటుచేసుకుంది. అబ్బాస్‌ అబ్దుల్లాహి షేక్‌ సిరాజి(31) ఈ ఏడాది ఫిబ్రవరి నెల 8న ప్రజా పనులు, పునర్నిర్మాణం శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం దేశ అధ్యక్షుడి కార్యాలయ సమీపంలోకి కారులో వస్తుండగా.. సెక్యురిటీ గార్డులు అనుమానాస్పద కారుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబ్బాస్‌ సిరాజి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో సోమాలియా అధ్యక్షుడు తన ఇథియోపియా పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి అంత్యక్రియల్లో పొల్గొనబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తప్పించారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 25 మంత్రుల్లో సిరాజ్‌ ఒకరు. సోమాలియా కేబినెట్‌లో అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న షాబాబ్‌ తీవ్రవాదులు సోమాలియా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మొగదీషులో తరచుగా దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement