రెస్టారెంట్పై దాడి : 19 మంది మృతి | At least 19 dead in Somalia Shebab restaurant attack: police | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్పై దాడి : 19 మంది మృతి

Published Fri, Jan 22 2016 11:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

రెస్టారెంట్పై దాడి : 19 మంది మృతి

రెస్టారెంట్పై దాడి : 19 మంది మృతి

మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని సముద్ర తీర రెస్టారెంట్పై తీవ్రవాదులు బాంబు దాడి చేసి.... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహ్మాన్ శుక్రవారం వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటన అత్యంత పాశవికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడిలో అమాయక ప్రజలు మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం సాయంత్రం రెస్టారెంట్లో ప్రజలు భోజనం చేస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ షిబాబ్ ప్రకటించింది.  కాగా ఈ ఘటనలో నలుగురు తీవ్రవాదులు మరణించగా.... మరోకరని పట్టుకున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement