సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రవాదుల దాడి! | Somalia's presidential palace attacked by Al Shabab | Sakshi
Sakshi News home page

సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రవాదుల దాడి!

Published Tue, Jul 8 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

Somalia's presidential palace attacked by Al Shabab

మొగదిషు: సోమాలియా అధ్యక్ష భవనంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ సహబ్ దాడి చేసింది. ఈ ఘటన సోమాలియా రాజధానిలో మొగదిషులో చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
అధ్యక్ష భవనం వద్ద ఇంకా పోరాటం చేస్తున్నామని అల్ సహబ్ కు చెందిన ప్రతినిధి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ భవనంలో లేరని తెలిసింది. 
 
రంజాన్ మాసంలో దాడులను అల్ సహబ్ ఉధృతం చేస్తోంది. గత శనివారం పార్లమెంట్ వద్ద కారు బాంబు ఘటనలో  నలుగురు మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement