presidential palace
-
రాష్ట్రపతి భవనంలో మిస్సైల్ మ్యాన్!
అదృష్ట దేవత ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. భారత ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుగా, ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న ‘మిస్సైల్ మ్యాన్’ ఆవుల్ ఫకీర్ జైనులుబ్దీన్ (ఏపీజే) అబ్దుల్ కలాం, 71వ ఏట, విశ్రాంత జీవితం కోసం డిసెంబర్ 2001లో చెన్నై చేరుకున్నారు. హాబీ కోసం అన్నా యూనివర్సిటీలో పార్ట్ టైం ప్రొఫెసర్ వర్కు ఎంచుకున్నారు ఆయన. ఆ రోజు (జూన్ 10, 2002) సాయంత్రం 5 గం.లు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ల్యాండ్ ఫోన్ ఆగకుండా మ్రోగటంతో, స్టాఫ్ విసుగుతో ఫోన్ ఎత్తి తమిళంలో, ‘హలో, యారదు’(ఎవరది) అని ప్రశ్నించటంతో, ‘దిస్ ఈజ్ ఫ్రమ్ పీఎంఓ ఆఫీస్, ఢిల్లీ. ప్రధాని కలాం సర్‌తో మాట్లాడాలి, పిలవండి’ అని అవతలి గొంతు వినిపించింది. పీఎంఓ మాట విని భయంతో, ‘సార్, క్లాసులో పాఠం బెబుతున్నారు. అది అవగానే కబురు చేస్తాను సార్’ అన్నాడు ఆఫీసు క్లర్కు. ఆరు గంటలకు, లెక్చర్ ముగించిన కలాం వరండాలో నడుస్తున్నది చూసి, వైస్ ఛాన్సలర్ ఏ. కళానిధి ఆయనకు ఎదురెళ్లి ఆతృతగా, ‘సార్ ఢిల్లీ నుండి మెసేజ్, ప్రధాని మీతో అర్జంటుగా మాట్లాడాలట’ అని అన్నాడు. ఆశ్చర్యంతో కలాం కనుబొమ్మలు ముడివడ్డాయి. ‘ఏమై ఉంటుందబ్బా?’ అనుకుంటూ వీసీ ఆఫీసు రూం కెళ్ళి, పీఎంఓకు ఫోన్ చేశారు. లైన్లో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి! ‘హలో కలాం సర్, హౌ ఈజ్ యువర్ అకాడమిక్ లైఫ్?’ అన్న ఆయన ప్రశ్నకు, ‘ఇట్ ఈజ్ వెరీ వండర్ఫుల్ సార్’ కలాం జవాబు. ‘ఇక అది వదలి, మీరు నా కోసం ఢిల్లీ రావలసి ఉంటుంది’ అంటూ గట్టిగా నవ్వారు ప్రధాని. సడన్‌గా జోకులు పేల్చి ఎదుటి వారిని తికమక పెట్టడం అటల్జీకి వెన్నతో పెట్టిన విద్య. ‘వింటున్నారా కలాంజీ’ మళ్ళీ ప్రశ్న. ‘యస్ సార్.’ ‘ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగులో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మీ పేరును ప్రస్తావించారు. మీ సమ్మతి కోసమే ఎదురుచూస్తున్నాము.’ ఊహించని పీఎం ప్రతిపాదనకు ఎటూ తోచలేదు కలాంజీకి. ‘ఆలోచించుకోవటానికి కొంత వ్యవధి ఇవ్వండి సార్‘ అని మాత్రం అనగలిగారు. ‘మీరు జస్ట్ ఓకే అనండి, రాష్ట్రపతి భవనంలోకి తీసుకెళ్ళే బాధ్యత నాది; ఫర్లేదు, రాత్రి 8.30 గంటల వరకూ మీకు సమయం ఉంది. ఆలోచించుకోండి; నో మాత్రం అనొద్దు ప్లీజ్’ అంటూ ఫోన్ పెట్టేశారు ప్రధాని. విషయం విని వైస్ ఛాన్సలర్ కళానిధి సంతోషం పట్టలేక కలాం చేయి అందు కుని, ‘అభినందనలు సార్’, అని అన్నారు. కలాం గారి మిత్ర బృందంలో ఈ వార్త అదే రాత్రి సుడిగాలిలా వెళ్ళింది. అందరిదీ ఓకే మాట... ‘వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వదలుకోవద్దు’ అని. ఇక రాత్రి 8.45 గంటలకు ప్రధాని కార్యాలయం నుండి మళ్ళీ కాల్. ప్రధాని ప్రపోజల్‌కు ‘యస్’ అన్నారు కలాం.13వ త్రిశంకు లోక్ సభలో బీజేపీకి దక్కిన సీట్లు కేవలం 182. బహుళ పార్టీల మద్దతుతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో కత్తి మీది సాములా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ అభ్యర్థికి ఎలెక్టోరల్ కాలేజీలో సరిపోను సంఖ్యా బలం కూడా లేదు అప్పటికి. ఐదు పదుల అలుపెరుగని పార్లమెంటరీ అనుభవం ఆయనది. అదే ఆత్మ విశ్వాసంతో, రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రఖ్యాత సైంటిస్టు, ఏపీజే కలాం పేరును రాష్ట్రపతి పదవికి అధికారికంగా ప్రకటించారు. తనదైన శైలిలో చక చక పావులు కదిపి, ప్రతిపక్షంలోని సీనియర్ నాయకులు శరద్ పవార్, ములాయం సింగ్, లాలూ యాదవ్ లను సంప్రదించి, కలాం అభ్యర్థిత్వాన్ని సుగమం చేశారు వాజ్‌పేయి. ఎన్డీఏ నాయకుల సమక్షంలో జూన్ 18న అబ్దుల్ కలాంతో నామినేషన్ వేయించారు. రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి, కలాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా సంపాదించి, జూలై 25న 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం జరిపించి తీరారు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. చివరిగా, దేశ ప్రథమ పౌరునిగా అబ్దుల్ కలాం పేరును ఎన్డీఏ తెరపైకి తెచ్చిన ఘనత మన తెలుగు ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్‌దే అన్న విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అప్పట్లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమ్రంతికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రసాద్... కలాం పేరు రాష్ట్రపతి పదవి కోసం సూచించారు. ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న నాటి ఏపీ సీఎం... వాజ్‌పేయికి ఈ ప్రతిపాదన చేశారు. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949(‘టర్నింగ్ పాయింట్స్, ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’ అనేఅబ్దుల్ కలాం గ్రంథం ఆధారంగా...) -
Russia-Ukraine war: పుతిన్‌పై హత్యాయత్నం
కీవ్: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భాగంగా బుధవారం తెల్లవారజామున అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్ దాడులు జరిగాయని ప్రకటించింది. ఇది మతిమాలిన ఉగ్రవాద చర్య అంటూ మండిపడింది. ఇందుకు తీవ్రస్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందని ప్రకటించింది. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్నదే వాటి అంతరార్థమని భావిస్తున్నారు. ‘‘దాడులను భగ్నం చేశాం. మా భద్రతా దళాలు డ్రోన్లలో మధ్యలోనే పేల్చేశాయి. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. క్రెమ్లిన్ భవనానికీ నష్టం జరగలేదు. ఆ సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరు. మాస్కో ఆవల నోవో ఒగర్యోవో నివాసంలో సురక్షితంగా ఉన్నారు’’ అని ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. మే 9న నగరంలో జరగాల్సిన విక్టరీ డే పరేడ్‌ను అడ్డుకోవడం కూడా దాడి లక్ష్యమని ఆరోపించారు. పరేడ్ యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు. దాడిపై అనుమానాలు క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులు జరిగినట్టు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రష్యా కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి రుజువులూ బయట పెట్టలేదు. దాడి జరిగితే ఆ విషయాన్ని 12 గంటల పాటు ఎందుకు దాచారన్న దానిపైనా వివరణ లేదు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడిగా చెబుతున్న వీడియోలు మాత్రం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మాస్కోలో డ్రోన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. క్రెమ్లిన్‌పై జరిగినట్టు చెబుతున్న డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తమపై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు బహుశా ఈ ఉదంతాన్ని సాకుగా రష్యా వాడుకోవచ్చని అభిప్రాయపడింది. తమ నగరాలపై జరుపుతున్న తీవ్ర స్థాయి సైనిక దాడులను ఇలా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌తో రష్యా 14 నెలలుగా పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ దాడులను ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఏం జరిగింది? దాడికి సంబంధించి పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకదాంట్లో క్రెమ్లిన్‌పైకి డ్రోన్ దూసుకొస్తూ కన్పించింది. అతి సమీపానికి వచ్చాక పేలిపోయి నేలకూలింది. క్రెమ్లిన్, సమీప భవనాల మీదుగా పొగ వస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. దాడికి సంబంధించి క్రెమ్లిన్ పక్కనున్న నది ఆవల నుంచి తీసినట్టు చెబుతున్న వీడియో మాస్కో స్థానిక టెలిగ్రా చానల్లో రాత్రి పూట ప్రసారమైంది.డ్రోన్ శకలాలు అధికార భవన ఆవరణలో పడ్డట్టు క్రెమ్లిన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు, పొగ వచ్చినట్టు స్థానికులు చెప్పుకొచ్చారు. దీనిపై రష్యాలో ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రతి దాడులకు దిగి ఉక్రెయిన్ సీనియర్ నాయకులను వరుసబెట్టి అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జెలెన్స్కీ ‘నిర్ణాయక దాడి’ వ్యాఖ్యల నేపథ్యంలో ఘటన ► ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తాజాగా ఫిన్లండ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ► రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని శక్తిమంతమైన ఆయుధాలు అందజేయాలని ఐదు నోర్డిక్ దేశాలు ఫిన్లండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్లను గట్టిగా కోరారు. ► ఈ సందర్భంగా హెల్సింకీలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ అతి త్వరలో ప్రతిదాడికి దిగనుందని ప్రకటించారు. ► ‘‘విజయం కోసం నిర్ణాయక దాడి చేయనున్నాం’’ అని చెప్పు కొచ్చారు. తర్వాత కాసేపటికే రష్యా నుంచి డ్రోన్ దాడి ఆరోపణ వెలువడింది. ► మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. రాజధాని కీవ్‌పై ఇరాన్ తయారీ డ్రోన్లతో రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ► 21 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు దక్షిణ రష్యాలో క్రాస్నోడర్ ప్రాంతంలో ఓ చమురు డిపోలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. -
ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి
కాబూల్: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని దేశ అధ్యక్షుడు ప్రసంగం చేసే సమయానికి ముందే అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటన పండుగ వేళ కలకలం రేపింది. ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనం లక్ష్యంగా మంగళవారం రాకెట్ల దాడి జరిగింది. దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న అధ్యక్ష భవనం సమీపంలోకి మూడు రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ చర్యను ఆఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. బక్రీద్ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు అశ్రఫ్ గని ప్రసంగం మొదలుపెట్టాలి. ప్రార్థనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. అయితే రాకెట్లు భవనం సమీపంలో పడినా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆఫ్ఘాన్ మంత్రి మిర్వాస్ స్టాన్క్జాయ్ ప్రకటించారు. ఈ దాడి ఎవరు జరిపారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. పండుగ వేళ కలకలం రేపేలా వారి చర్యలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికా, నాటో దళాలు పూర్తిగా విరమించుకున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఏకంగా అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ దాడిని అధ్యక్షుడు అశ్రఫ్ గని తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల తీరుపై అశ్రఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కో సం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ తమిళిసై, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఎట్‌హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రాష్ట్రపతి కోవింద్ దంపతులు అభివాదం చేసి పేరు పేరునా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ రాష్ట్రపతి కోవింద్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారంతా రాష్ట్రపతి దంపతులతో గ్రూప్ ఫొటో దిగారు. -
అధ్యక్ష భవనం ఎదుట కారు బాంబు పేలుడు
ఆడెన్: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమయ్యింది. గురువారం దక్షిణ యమనీ సిటీలోని అధ్యక్ష భవనం ముందు కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బాంబులతో ఉన్న కారును వేగంగా వచ్చి అధ్యక్ష భవనాన్ని ఢీ కొట్టిన దుండగుడు ఆత్మహుతికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధ్యక్షున్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఇటీవలే అధ్యక్షుడు అబ్ద్-రబ్బుమాన్సోర్ హడీ సౌదీ అరేబియాలోని ఎక్సైల్ నుంచి ఆడెన్ చేరుకున్నారు. హౌతీ రెబల్స్, సంకీర్ణ దళాలు నగరాన్ని సమీపిస్తున్నారన్న సమాచారంతో గత ఏడాది అధ్యక్షుడు హడీ ఆడెన్‌ను విడిచి వెళ్లారు. -
సోమాలియా అధ్యక్ష భవనంపై ఉగ్రవాదుల దాడి!
మొగదిషు: సోమాలియా అధ్యక్ష భవనంపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ సహబ్ దాడి చేసింది. ఈ ఘటన సోమాలియా రాజధానిలో మొగదిషులో చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష భవనం వద్ద ఇంకా పోరాటం చేస్తున్నామని అల్ సహబ్ కు చెందిన ప్రతినిధి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాడి జరిగిన సమయంలో సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ భవనంలో లేరని తెలిసింది. రంజాన్ మాసంలో దాడులను అల్ సహబ్ ఉధృతం చేస్తోంది. గత శనివారం పార్లమెంట్ వద్ద కారు బాంబు ఘటనలో నలుగురు మృతి చెందారు.