భగ్నం చేసిన భద్రతా సిబ్బంది
దాడి చేసిన 19 మంది ముష్కరుల హతం
ఇంజమెనా (చాద్): మధ్య ఆఫ్రికా దేశం చాద్‌లో దేశాధ్యక్ష భవనంపై దాడికి విఫల యత్నం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని భగ్నం చేసినట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. దాడి సమయంలో అధ్యక్షుడు మహమత్ దెబీ ఇత్నో భవనం లోపలే ఉన్నట్టు ధ్రువీకరించింది. అయితే, ‘దాడిని తిప్పికొట్టాం. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది ముష్కరులు హతమయ్యారు. ఆరుగురిని బందీలుగా పట్టుకున్నాం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది‘ అని చాద్ విదేశాంగ మంత్రి అబ్దరమాన్ కౌలామల్లాహ్ తెలిపారు.
రాజ్యాంగబద్ద పాలనను అమలుచేస్తున్నందుకు అభినందించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చాద్‌కు వచ్చి అధ్యక్షుడిన కలిసిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బొకో హరాం పని కావచ్చన్న అనుమానాలను తోసిపుచ్చారు. ‘జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చు. దాడికి పాల్పడ్డ వాళ్లంతా తప్ప తాగి అన్నారు. డ్రగ్స్ మత్తులో కనిపించారు. వారంతా రాజధానికి చెందిన దారి తప్పిన యువకులే‘ అని ఆయన అన్నారు. దాదాపు 1.8 కోట్ల జనాభా ఉన్న చాద్ దేశంలో కొంతకాలంగా రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది.
Comments
Please login to add a commentAdd a comment