attempt to attack
-
సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్లో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో హత్యాయత్నానికి పాల్పడినట్టు వీడియో ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. డాబా కొట్ల జంక్షన్ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఆ ప్రాంతంలోని పలువురి సెల్ ఫోన్లలో వీడియో రికార్డులు, హత్యాయత్నం చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు సమాచారం. దాని ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రౌడీషి టర్లు, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసులో విజయవాడ పోలీసులు పలువురు అనుమానితులను గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం నేర చరితులతోపాటు ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వీడియో ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా దాదాపు 60 మంది వరకు అనుమానితులను మ్యాపింగ్ చేశారు. వారిని పోలీసులు పిలిపించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో మాజీ ప్రజాప్రతినిధి వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించే రౌడీషిటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు, ఇతర అసాంఘిక శక్తులపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి వారి కాల్ డేటాను విశ్లేíÙస్తున్నారు. అనుమానితులు ఏయే ప్రాంతాల్లో సంచరించింది.. వారి ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ చేశారు.. గ్రూప్ కాల్స్ ఏమైనా మాట్లాడారా అనే కోణాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాల ఆధారంగా అనుమానితులను పలు కోణాల్లో ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలను కాల్ డేటా విశ్లేషణతోపాటు ఆ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్పిన వివరాలతో సరిపోలుస్తున్నారు. ఆ విధంగా పిలిపించి విచారించిన దాదాపు 60మందిలో ఓ పదిమంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డాబా కొట్ల సెంటర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో.. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి డాబా కొట్ల జంక్షన్ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా ఈ కేసును ఛేదించాలని భావిస్తున్నారు. వివేకానంద స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో యాత్ర సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని ఆగంతుకుడికి ముందే తెలుసు. ఆ స్కూల్ ప్రాంగణంలో మాటు వేసి హత్యాయత్నానికి పాల్పడిన వెంటనే మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం వల్లే డాబాకొట్ల ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాంతంపై ఆగంతకుడికి పూర్తి పట్టు ఉండటంతో ఆ ప్రాంతానికి లేదా ఆ సమీప ప్రాంతానికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని తన ఇంటికి లేదా తనకు ఆశ్రయం ఇచ్చేవారి ఇంటికి సులువుగా చేరుకుని పోలీసుల కళ్లు కప్పవచ్చనే ధీమా కూడా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే సింగ్ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, ఇతర అసాంఘిక శక్తులపై పోలీసులు దృష్టి సారించారు. వారిలో రాజకీయ పారీ్టల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు, ప్రత్యర్థి పార్టీ వర్గీయులతో ఘర్షణ పడ్డ చరిత్ర ఉన్నవారు, గంజాయి తదితర వ్యసనాలకు బానిసైనవారు.. ఇలా పలు కోణాల్లో అనుమానితులను గుర్తించి విచారించే ప్రక్రియను వేగవంతం చేశారు. సమాచారమిస్తే రూ.2లక్షల బహుమతి ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన ఆగంతుకుడి సమాచారం అందిస్తే రూ.2లక్షల నగదు బహుమతి అందిస్తామని విజయవాడ పోలీసులు సోమవారం ప్రకటించారు. అగంతకుడికి సంబంధించిన సమాచారం/వీడియో, సెల్‌ఫోన్ ఫుటేజీ అందించినా, హత్యాయత్నాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ముందుకు వచ్చి సమాచారమిచి్చనా ఈ బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచి్చనవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆగంతకుడి సమాచారాన్ని నేరుగా లేదా ఫోన్/వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. సమాచారం అందించేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు కంచి శ్రీనివాసరావు, డీసీపీ 9490619342 ఆర్. శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్స్: 9440627089 -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్‌పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మామపై అల్లుడు బాణం..!
సాక్షి, కర్నూలు: తనను మందలించాడన్న కోపంతో మామపై అల్లుడు బాణంతో దాడి చేశాడు. ఈ ఘటన ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచుగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ వెంకటరమణ కథనం మేరకు..బైర్లూటి చెంచుగూడేనికి చెందిన బరమల బయ్యన్నకు ఐదుగురు సంతానం. అందరూ కుమార్తెలే. నలుగురిని గూడెంలోనే ఇచ్చి వివాహం చేశాడు. చిన్నకుమార్తె వీరమ్మను మాత్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొరపలూరుకు చెందిన ఉత్తలూరి చిన్నోడికి ఇచ్చి వివాహం జరిపించాడు. చిన్నోడు మద్యానికి బానిసయ్యాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఈ విషయం తెలుసుకున్న బయ్యన్న మూడు రోజుల క్రితం గూడెం పెద్దలతో కలిసి కొరపలూరుకు వెళ్లి అల్లుణ్ని మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన చిన్నోడు ఆదివారం వేకువజామున బైర్లూటి గూడేనికి చేరుకుని.. మామతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చిన్నోడు తన వెంట తెచ్చుకున్న విల్లంబుతో మామ ఛాతిపై గురిపెట్టి బాణం వదిలాడు. అది అతని శరీరంలోకి దూసుకెళ్లింది. గాయపడిన బయ్యన్నకు ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు -
కరోనా: ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం
సాక్షి, కైలాస్‌నగర్(ఆదిలాబాద్) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి కుంటుంబాలను సర్వే చేసేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలపై దాడికి యత్నించడం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడంపై జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వేకు ప్రజలు సహకరించడం లేదని, దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని, గదుల్లో బంధిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లే..!) చిల్కూరి లక్ష్మినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్త భారతి శివాజీచౌక్‌లో సర్వేకు వెళ్లగా.. ఓ అనుమానితుడు సర్వే ఫైల్‌ను చించే ప్రయత్నం చేసి దాడికి యత్నించాడు. సదరు వ్యక్తిపై వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక శివాజీచౌక్‌కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని సర్వే చేసేందుకు ఆశా కార్యకర్త భారతి వెళ్లగా.. అతడి సోదరుడు దురుసుగా ప్రవర్తించాడు. భారతి ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్వయంగా కేసును పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని ఆదేశించారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ఖుర్షీద్‌నగర్ ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్త అర్చన ఖుర్షీద్‌నగర్‌లో సర్వేకు వెళ్లగా కొందరు స్థానికులు దురుసుగా ప్రవర్తించారు. ఇలా వరుస సంఘటనలో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తొడసం చెందు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ విష్ణు వారియర్ సర్వేకు వెళ్లే ఆశా కార్యకర్తలకు పోలీసు సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్వేలకు వచ్చిన ౖసిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (కరోనా: మరో షాకింగ్ న్యూస్!) -
తెలంగాణ తల్లి విగ్రహం తొలగించేందుకు యత్నం
పాల్వంచ: పట్టణంలో అంబేడ్కర్ సెంటర్లోని తె లంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తుండటంతో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అంబేడ్కర్ సెం టర్లో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. శుక్రవారం దీనిని అక్కడ పనిచేసే వ్యక్తులు కొందరు తొలగించేం దుకు డ్రిల్ మిషన్‌ను తెచ్చి పనులు ప్రారంభించా రు. సమాచారం అందుకున్న టీఆర్ఎస్ నాయకు లు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సయ్యద్ రషీద్ తదితరులు అక్కడి చేరుకుని అడ్డుకున్నారు. పదేళ్ల కిందట తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహా న్ని తొలగించడం సరైంది కాదన్నారు. తొలగించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో పట్టణ ఎస్ఐ ముత్యం రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు తంగేటి రాము, పెద్ది బాబు, ఉబ్బన శ్రీను, గిరి పాల్గొన్నారు. -
దౌర్జన్యాల.. జన్మభూమి
అధికారం ‘బరి’తెగిస్తోంది.. సమస్యలపై నోరు విప్పడం తప్పుఅవుతోంది.. ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారు.. ఊరురా అర్జీలు అందించాలని ప్రచారం చేస్తున్న అధికారులు చేష్టలుడికి చూస్తున్నారు.. జన్మభూమి కమిటీ సభ్యులు రెచ్చిపోతుండగా ప్రజాప్రతినిధులు అండగా ఉంటున్నారు. అందుకు జన్మభూమి సభలు వేదికలయ్యాయి. మచిలీపట్నంటౌన్ : పట్టణంలోని 29వ వార్డులో సోమవారం నిర్వహించిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు వీరంగం సృష్టించారు. వార్డు కౌన్సిలర్‌గా ప్రాతి నిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీర్అస్గర్అలీతో పాటు కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, కోసూరి లక్ష్మీనాంచారయ్య, పార్టీ నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌లపై దౌర్జన్యానికి దిగారు. చొక్కా కాలర్లు పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారు. సభలో ఉన్న మునిసిపల్ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం కూడా వారికి మద్దతుగా నిలవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గొడవ ప్రారంభమైంది ఇలా మీ వార్డులో పింఛన్లు అందని వారు ఎవరైనా ఉన్నారా అని చైర్మన్ బాబాప్రసాద్ ప్రశ్నించారు. దీంతో ఆ వార్డుకు చెందిన గట్టా కనకదుర్గ ఆయన వద్దకు వచ్చి చేతులు జోడించి దండం పెట్టి ‘అయ్యా నా భర్త తాతయ్య మృతి చెంది నాలుగు సంవత్సరాలైంది.. అప్పటి నుంచి వితంతు పింఛను కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా’ అని సభ దృష్టికి తీసుకొచ్చారు. చూస్తా.. వెళ్లి కూర్చో అంటూ చైర్మన్ ఆమెను పంపే ప్రయత్నం చేశారు. ఈ దశలో పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న కొంత మంది దరఖాస్తుదారులు ఆయన వద్దకు వెళ్లారు. నాలుగేళ్లుగా కనకదుర్గకు పింఛను రాకపోతే ఏం చేస్తున్నావంటూ అవార్డు కౌన్సిలర్ అస్గర్‌ను వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం ప్రశ్నించారు. దీంతో అస్గర్ లేచి వీరందరూ పింఛను పొందేందుకు అర్హులేనని వీరికి పింఛను మంజూరు చేయాలంటూ పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించానని, జన్మభూమి సభల్లో అడిగినా మంజూరు కాలేదన్నారు. ఈ దశలోనే ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు అస్గర్‌తో పాటు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. చొక్కా కాలర్‌ను పట్టుకున్నారు. కౌన్సిలర్ అస్గర్ మాట్లాడతూ వార్డులో 72 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయటం లేదని అదేమని అడిగితే సభలో రాజకీయం చేయవద్దని చైర్మన్ వారించే ప్రయత్నం చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. సభలో మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, కమిషనర్ ఎం.జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రిక, డీఈ వెంకటేశ్వరగుప్తా ఉన్నారు. పట్టణంలోని 30, 31, 32, 33 వార్డుల్లో కూడా జన్మభూమి సభలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. -
అర్థరాత్రి యువకుడిపై దాడి
తూర్పు గోదావరి జిల్లా : జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామంలో అర్థరాత్రి జగ్గంపేటకు చెందిన యువకుడు కేశినీడి వీరబాబుపై హత్యాయత్నం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం రామవరం హైవేను ఆనుకుని వీరబాబు దాబా హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో హోటల్లో పనులు ముగించుకుని రామవరంలో ఉంటున్న నివాసం వద్దకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వీరబాబు కేకలకు సమీపంలో ఉన్నవారు మేల్కోవడంతో నిందితులు పరారయ్యారు. సంఘటనా స్థలం వద్ద బురదగా ఉండడంతో వీరబాబు ఒంటి నిండా బురదతో నిండిపోవడంతో కడిగి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు పది మంది మూకుమ్మడిగా వచ్చిన వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న తనను కొట్టి కింద పడేసి కాళ్లు, చేతులతో దాడి చేశారని, తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా గాయపడిన వీరబాబు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎసై్స అలీఖాన్ బాధితుడి నుంచి ఆస్పత్రిలో స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. పోలీసులు కేసును అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. జగ్గంపేటలో స్థల వివాదమే వీరబాబుపై హత్యాయత్నానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. -
ఈవీ మహేశ్వర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నం
కాజీపేట : వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఈవీ మహేశ్వర్ రెడ్డి నివాసంపై దాడికి యత్నం జరిగింది. అయిదు ట్రాక్టర్లతో వచ్చిన వ్యక్తులు దాడికి యత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.