బరమల బయ్యన్న ఛాతిలో దిగిన బాణం
సాక్షి, కర్నూలు: తనను మందలించాడన్న కోపంతో మామపై అల్లుడు బాణంతో దాడి చేశాడు. ఈ ఘటన ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచుగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ వెంకటరమణ కథనం మేరకు..బైర్లూటి చెంచుగూడేనికి చెందిన బరమల బయ్యన్నకు ఐదుగురు సంతానం. అందరూ కుమార్తెలే. నలుగురిని గూడెంలోనే ఇచ్చి వివాహం చేశాడు. చిన్నకుమార్తె వీరమ్మను మాత్రం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొరపలూరుకు చెందిన ఉత్తలూరి చిన్నోడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
చిన్నోడు మద్యానికి బానిసయ్యాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఈ విషయం తెలుసుకున్న బయ్యన్న మూడు రోజుల క్రితం గూడెం పెద్దలతో కలిసి కొరపలూరుకు వెళ్లి అల్లుణ్ని మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన చిన్నోడు ఆదివారం వేకువజామున బైర్లూటి గూడేనికి చేరుకుని.. మామతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చిన్నోడు తన వెంట తెచ్చుకున్న విల్లంబుతో మామ ఛాతిపై గురిపెట్టి బాణం వదిలాడు. అది అతని శరీరంలోకి దూసుకెళ్లింది. గాయపడిన బయ్యన్నకు ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు
Comments
Please login to add a commentAdd a comment