రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి! | Terror Attack In Somalia At Least 10 Dead | Sakshi
Sakshi News home page

సోమాలియాలో ఉగ్రదాడి..10 మంది మృతి

Published Sat, Jul 13 2019 10:13 AM | Last Updated on Sat, Jul 13 2019 10:20 AM

Terror Attack In Somalia At Least 10 Dead - Sakshi

కిస్మాయో : సోమాలియాలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. కారు బాంబుతో ఓ హోటల్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్‌లో తొలుత కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు అనంతరం కారు బాంబును పేల్చారు. ఈ దుశ్చర్యకు బాధ్యులము తామేనని ఆల్‌-షబాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కాగా సోమాలియాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వివిధ పార్టీల పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆ హోటల్‌లో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో సామాన్య పౌరులు, హోటల్‌ సిబ్బంది సహా ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిపిన అనంతరం దాదాపు మూడు గంటల పాటు ఉగ్రవాదులు అక్కడే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపనున్నట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement