సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి | Twin suicide bombs kill 13 near Somalia's Mogadishu airport | Sakshi
Sakshi News home page

సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి

Published Tue, Jul 26 2016 3:41 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి - Sakshi

సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి

మొగదిషు: సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం మొగదిషు విమానాశ్రయానికి సమీపంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తూర్పు ఆఫ్రికాకు చెందిన అల్ షాబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

మొదట ఎయిర్పోర్టు ప్రవేశద్వారం ఆత్మాహుతి దాడి జరిగినట్టు పోలీసులు చెప్పారు. చెక్పాయింట్ దగ్గర రెండో సూసైడ్ బాంబర్ పేల్చుకున్నట్టు తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉందని చెప్పారు. విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆఫ్రియా యూనియన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement