Mogadishu airport
-
సోమాలియాలో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
మొగదిషు: సోమాలియాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం మొగదిషు విమానాశ్రయానికి సమీపంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని తూర్పు ఆఫ్రికాకు చెందిన అల్ షాబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మొదట ఎయిర్‌పోర్టు ప్రవేశద్వారం ఆత్మాహుతి దాడి జరిగినట్టు పోలీసులు చెప్పారు. చెక్‌పాయింట్ దగ్గర రెండో సూసైడ్ బాంబర్ పేల్చుకున్నట్టు తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉందని చెప్పారు. విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆఫ్రియా యూనియన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
సోమాలియాలో ఆత్మాహుతి దాడి
మొగదిష్ : సోమాలియా రాజధాని మొగదిష్ విమానాశ్రయంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పేలుడుకు తమదే బాధ్యత అని ఆల్ షెబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతి దాడితో పాటు మరో పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ కుట్రకు వాడింది 'ల్యాప్ టాప్ బాంబ్'
- సోమాలియా విమానం పేల్చివేతకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించిన ఉగ్రవాదులు మొగదీషు: సంచలనం రేపిన సోమాలియా విమానం పేల్చివేత యత్నానికి ఉగ్రవాదులు ల్యాప్ ట్యాప్ బాంబు వాడినట్లు తెలిసింది. ల్యాప్ టాప్ లో అమర్చిన బాంబు సెన్సార్లకు చిక్కుండా, ఎక్స్ రేలకు సైతం దొరకకుండా ఉండేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారని, పేలుడు ద్వారా 14 వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ధ్వంసం చేయాలని ఉగ్రవాది కుట్రపన్నాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. గత బుధవారం సోమాలియా రాజధాని మొగాదిషు నుంచి జిబౌతికి డాల్లో ఎయిర్వేస్కు చెందిన విమానం 74 మంది ప్రయాణికులతో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి విమానం ఇంజిన్ సమీపంలో మీటరు వ్యాసంతో రంధ్రం ఏర్పడింది. అయితే.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మొగాదిషు విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. ఈ ఘటనలో విమానం రంధ్రం నుంచి కిందపడి మృతిచెందిన ప్రయాణికుడే బాంబు పేల్చిన ఉగ్రవాది అయి ఉంటాడని దర్యాప్తు అధికారులు అంచనావేస్తున్నారు. 'నిజానికి డాల్లో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించినవారంతా టర్కీ విమానంలో జిబౌతీకి వెళ్లాల్సింది. అయితే వాతావరణం అనుకూలించలికారణంగా టర్కీ విమాన సర్వీసు రద్దయింది. దీంతో 74 మందిని డాల్లో ఎయిర్ లైన్స్ లో పంపించాం. విమానం బయలుదేరటానికి ముందు ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో చేతిలో ల్యాప్ టాప్ పట్టుకుని సంచరించిన వ్యక్తి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుణ్ని కనిపెట్టగటిగాం. సోమాలియా జాతీయుడైన అతని పేరు అబ్ధుల్లాహి అబ్దిసలాం బోర్లేహ్' అని దర్యాప్తు అధికారులు బుధవారం మీడియాకు వెల్లడించారు. -
తీవ్రవాదుల ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదీషులో అల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ చెందిన తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ దాడులలో 11 మంది చనిపోయారు. వారిలో నలుగురు భద్రత సిబ్బంది కూడా ఉన్నారు. మొగదీషు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ప్రముఖ జజీరా హోటల్ వద్ద తీవ్రవాదులు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. స్థానికులు, భద్రత సిబ్బంది వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అయితే కొన్ని నిముషాల తేడాతో ఆ ప్రదేశానికి అతి సమీపంలో మరో కారు పేలింది. దాంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. అయితే మొగదీషులోని జజీరా హోటల్‌కు తరచుగా స్థానిక రాజకీయ నాయకులు, విదేశీయులు తరచుగా వస్తుంటారు. వారిని లక్ష్యంగానే ఆ దాడులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ దాడిని సోమాలియా ప్రధానమంత్రి ఖండించారు. 2014 ఆరంభంలో కూడా తీవ్రవాదులు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ఆత్మాహుతి దాడి బుధవారం చేసుకుంది.