సోమాలియా రాజధాని మొగదీషులో అల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ చెందిన తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ దాడులలో 11 మంది చనిపోయారు. వారిలో నలుగురు భద్రత సిబ్బంది కూడా ఉన్నారు. మొగదీషు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ప్రముఖ జజీరా హోటల్ వద్ద తీవ్రవాదులు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. స్థానికులు, భద్రత సిబ్బంది వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.
అయితే కొన్ని నిముషాల తేడాతో ఆ ప్రదేశానికి అతి సమీపంలో మరో కారు పేలింది. దాంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. అయితే మొగదీషులోని జజీరా హోటల్కు తరచుగా స్థానిక రాజకీయ నాయకులు, విదేశీయులు తరచుగా వస్తుంటారు. వారిని లక్ష్యంగానే ఆ దాడులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ దాడిని సోమాలియా ప్రధానమంత్రి ఖండించారు. 2014 ఆరంభంలో కూడా తీవ్రవాదులు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ఆత్మాహుతి దాడి బుధవారం చేసుకుంది.