Debt recovery
-
ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!
ఎవరికైనా అప్పు ఇచ్చారా..? తిరిగి చెల్లించడం లేదా..? అయితే కింద తెలిపిన విధంగా చేస్తే దాదాపు మీ డబ్బు తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు మీరు డబ్బు ఇచ్చినట్లు రుజువులు మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు స్టేట్మెంట్ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఒకవేళా గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ చేసినా బ్యాంక్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా స్టేట్మెంట్ తీసుకోవచ్చు.అప్పు ఇచ్చాక చెప్పిన సమయానికి తిరిగి చెల్లించకుండా చాలామంది కాలయాపన చేస్తూంటారు. అలాంటి సందర్భంలో అప్పు తీసుకున్నట్లు మీ వద్ద ఉన్న రుజువులతో లీగల్‌గా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపవచ్చు. దాంతో చాలా వరకు ఆ లీగల్ నోటీసుకు బయపడి మీ అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరు అలా నోటీసులు స్వీకరించినా అప్పు చెల్లించరు.ఇదీ చదవండి: భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!లీగల్ నోటీసులు అందుకుని అప్పు చెల్లించని వారికోసం మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్టేషన్ ద్వారా మనీసూట్ను పంపించాలి. అప్పు తీసుకున్న వారు దానికి స్పందించకపోతే కోర్టు ద్వారా తమను అదుపులోకి తీసుకుని వివరణ కోరే అవకాశం ఉంటుంది. అయితే అసలు అప్పు ఇవ్వడమే ఖర్చు..మళ్లీ పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాలంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాంటి వారు మనీసూట్లో అందుకు అయ్యే ఖర్చును సైతం పొందేలా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుతోపాటు దాని రికవరీకి అయిన ఖర్చును సైతం తిరిగి చెల్లించాల్సిందే. -
డిజిటల్‌కు సానుకూలం.. రికవరీకి ప్రతికూలం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ సమయం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగానికి రుణాల మంజూరుపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. రుణాల రికవరీ దారుణంగా పడిపోయింది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడం, భౌతికదూరం పాటించడం వంటి కారణాలతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై సానుకూల ప్రభావం పడింది. ఈ విషయాలు దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా నాబార్డు నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో వ్యవసాయ రంగానికి కిసాన్ క్రెడిడ్ కార్డులు, టర్మ్ రుణాల మంజూరు, రుణాల రికవరీ, డిజిటల్ బ్యాంకింగ్‌తో పాటు కనీస బ్యాంకింగ్ సేవలపై పడిన ప్రభావంపై జిల్లాల వారీగా నాబార్డు సర్వే నిర్వహించింది. బ్యాంకింగ్ సేవలపై ప్రభావం కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉండగా కొన్ని జిల్లాల్లో మోస్తరుగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఎటువంటి ప్రభావం చూపలేదు. లాక్డౌన్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో వ్యవసాయం, డెయిరీ, మత్స్యరంగం, ఉద్యానరంగంపై ప్రభావం పడింది. జీవనోపాధిపైన ప్రభావం చూపింది. దీంతో రైతులు రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల రుణాల రికవరీపై దేశంలో 94 శాతం జిల్లాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపించింది. ► కిసాన్ క్రెడిడ్ కార్డులపై రైతులకు రుణాల మంజూరుపై దేశ వ్యాప్తంగా 59 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది. కేరళలో నూరు శాతం జిల్లాల్లో, అసోంలో 75, పశ్చిమ బెంగాల్లో 76, ఉత్తరప్రదేశ్‌లో 75, బిహార్‌లో 73, మహారాష్ట్రలో 71 శాతం జిల్లాల్లో రైతులకు రుణాల లభ్యతపై తీవ్ర ప్రభావం పడింది. ► కనీస బ్యాంకింగ్ సేవలైన డిపాజిట్లు, విత్‌డ్రాలపైన 50 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ఛత్తీస్‌గడ్‌లో 78 శాతం, జార్ఖండ్‌లో 75 శాతం, మహారాష్ట్రలో 68 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం కనిపించింది. ► టర్మ్ రుణాల మంజూరుపై 89 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. లాక్డౌన్లో రాకపోకలపై ఆంక్షలు కారణంగా ప్రాజెక్టును సందర్శించేందుకు బ్యాంకు సిబ్బంది ఆసక్తి చూపకపోవడంతో పాటు ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. చిన్న రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో వందశాతం, బిహార్, పంజాబ్, రాజస్థాన్‌లలో 95 శాతం, మహారాష్ట్రలో 94 శాతం, మధ్యప్రదేశ్‌లో 91 శాతం జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడింది. ► బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీలపై 63 శాతం జిల్లాల్లో సానుకూల ప్రభావం చూపింది. గతంలో డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ఇష్టపడని వారు కూడా లాక్డౌన్ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. దీనిపై అవగాహనలేనివారు కూడా ఇతరుల సహాయంతో చేశారు. కేరళలో 95 శాతం, పంజాబ్‌లో 91, రాజస్థాన్‌లో 90, హరియాణాలో 87, బిహార్‌లో 81 శాతం డిజిటల్ లావాదేవీలపై సానుకూల ప్రభావం నెలకొంది. -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
1.16 లక్షల కోట్ల రికవరీపై చేతులెత్తేసిన బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ 16 బ్యాంకులు కలిసి పేరుకుపోయిన రూ 1.16 లక్షల కోట్ల రుణ బకాయిలను రాబట్టలేక చేతులెత్తేశాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్, దివాలా చట్టం 2016 వంటి పలు యంత్రాంగాల ద్వారా ఈ రుణ మొత్తాలను వసూలు చేయలేకపోయిన బ్యాంకులు చివరి అస్త్రంగా వీటిని అసెట్ రీకన్స్ర్టక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు అమ్ముకుని చేతులు దులుపుకున్నాయి. రుణాలను వేగంగా రికవరీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా తీసుకువచ్చిన దివాలా చట్టం 2016 కింద రుణ రికవరీ ప్రక్రియ జాప్యం జరుగుతుండటంతో బ్యాంకులు మొండి బకాయిలను తెగనమ్మి బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. గత వారం ఎస్బీఐ ఎస్సార్ స్టీల్‌కు ఇచ్చిన రూ 15,000 కోట్ల రుణాలను 18 శాతం రాయితీతో విక్రయించి మార్కెట్ వర్గాలను విస్మయానికి లోనుచేసింది. డిస్కాంట్‌కు తాము రుణాలను విక్రయించినా బ్యాంకుకు రూ 9,500 కోట్ల నగదు లభించిందని, ఇది ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగిస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. రుణాలు పేరుకుపోతే దానికి కేటాయింపులూ పెరుగుతాయని, మూలధనం ఎక్కువకాలం నిలిచిఉండటం మంచిదికాదని ఆయన చెప్పుకొచ్చారు. 62 ఖాతాలకు చెందిన రూ 27,953 కోట్ల రుణాలను ఎస్బీఐ వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉంచింది. ఈ తరహా రుణాలను కొనుగోలు చేసేందుకు డచ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెడ్జ్ ఫండ్స్‌లు ఆసక్తి చూపుతున్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రూ 29,801 కోట్ల రుణాలను అమ్మకానికి పెట్టగా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, దేనా బ్యాంక్‌లూ నిరర్ధక ఆస్తుల విక్రయానికి మొగ్గుచూపుతున్నాయి. -
లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం
11న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ గతేడాది 6,381 కేసులు పరిష్కరించామని వెల్లడి హైదరాబాద్: లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సత్వర న్యాయం అందడమేగాక శాశ్వత పరిష్కారం లభిస్తుందని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి శ్రీసుధ తెలిపారు. ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజుతో కలసి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఆరు పర్యాయాలు లోక్‌అదాలత్ నిర్వహించి 6,381 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.65 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు. సిటీ సివిల్ కోర్టులో 31 వేల పెండింగ్ కేసులు ఉన్నాయని, ఇందులో కుటుంబ వివాదాలు, సివిల్ కేసులతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, చిట్‌ఫండ్, ప్రమాద బీమా, రుణాల రికవరీ కోసం బ్యాంకులు వేసిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 వేల కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలి పారు. ఇందుకోసం బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు పంపుతున్నామని వివరించారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు గెలిచినట్లేనని, సమ యం, డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్ ఇచ్చే అవార్డుకు అప్పీల్ ఉండదని, ఇక్కడ కేసు పరిష్కరించుకోవడం ద్వారా కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చ న్నారు. ప్రీలిటిగేషన్ కేసులను కూడా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తామని.. మరింత సమాచారం కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
మొండి బకాయిలకు... మూల కారణం గుర్తించాలి
సుప్రీంకోర్టు వ్యాఖ్య... కేవలం పేర్లు వెల్లడిస్తే సమస్య పరిష్కారం కాబోదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌కు రూ.500 కోట్లు ఆపైన బకాయిదారుల పేర్లు వెల్లడించినంత మాత్రాన మొండిబకాయిల సమస్య (ఎన్పీఏ) పరిష్కారం అయిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. తీవ్రమైన ఎన్పీఏ సమస్యకు ప్రధాన కారణాన్ని విశ్లేషించి, పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడింది. మొండిబకాయిలు, రూ.500 కోట్లు పైబడిన వారి పేర్ల వెల్లడికి సంబంధించి జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్వేకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది. భారీ రుణ బకాయిదారుల పేర్ల వెల్లడి అవకాశాలను పరిశీలించాలని ఇప్పటికే కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. రుణ రికవరీ వ్యవస్థను సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? డెట్ రికవరీ ట్రిబ్యునళ్లు (డీఆర్టీ), డెట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డీఆర్ఏటీ) వంటి న్యాయ వేదికల చట్టాల పటిష్టత విషయంలో చర్యలు వంటి అంశాలపై నాలుగువారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) రంజిత్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతక్రితం రంజిత్ కుమార్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ... ఎన్పీఏలు సహా ఇందుకు సంబంధించి వివిధ సమస్యలపై ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ వెల్లడించారు. 57 డిఫాల్టర్ల బకారుులు రూ.85,000 కోట్లు... అంతక్రితం సొలిసిటర్ జనరల్ మొండిబకాయిదారుల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేస్తూ... కేవలం 57 మంది రుణ గ్రహీతలు బ్యాంకింగ్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.85,000 కోట్లని అన్నారు. ‘‘ఈ రుణ గ్రహీతలు ఎవరు? వారు ఎంత చెల్లించాలి? ఎందుకు తిరిగి చెల్లించడం లేదు? వంటి అంశాలు ప్రజలకు ఎందుకు తెలియకూడదు’’ అని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 8,100 ఎగవేతదారులు... రూ.76,685 కోట్లు దేశంలో 2016 మార్చి నాటికి దాదాపు 8,167 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.76,685 కోట్లని లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఏడాదిలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 16% పెరిగిందని ఆయన తెలిపారు. రూ.25 లక్షలు పైబడిన బకాయిదారుల సంఖ్య 2015 మార్చి నాటికి 7.031 మంది ఉంటే ఆ సంఖ్య 2016 మార్చి నాటికి 8,167 మందికి చేరినట్లు తెలిపారు. అదే సమయంలో బకాయిలు 28.5 శాతం ఎగసి రూ.59,656 కోట్ల నుంచి రూ.76,685 కోట్లకు చేరినట్లు వివరించారు. 2015-16లో రూ.21,509 కోట్ల వసూళ్లకు సంబంధించి బ్యాంకులు 1,724 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్లు తెలిపారు. అరుుతే ఈ కేసుల విషయంలో శిక్షలు 1.14 శాతమే ఉందని వివరించారు. అలాగే బ్యాంకులు గడచిన ఏడాది కేవలం రూ.3,498 కోట్ల బకాయిలను మాత్రమే వసూలు చేసుకోగలిగాయని తెలిపారు.