వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మానసిక సామర్థ్యానికి (మెంటల్ ఫిట్‌నెస్ టెస్ట్) సంబంధించిన పరీక్షలు నిర్వహించడం లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ వారంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అందులో మెంటల్ ఫిట్‌నెస్ టెస్ట్ లేదని వెల్లడించింది. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారికి రాబోయే ఏడాదిలో పనిచేయగల సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.
అందులో భాగంగా ఈ వారంలో వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో ట్రంప్‌కు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ నివేదికను బహిర్గతం చేయనున్నట్లు వైట్ హౌస్ ఇది వరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ట్రంప్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన ట్వీట్లను విశ్లేషిస్తూ ఓ రచయిత ప్రత్యేకంగా పుస్తకం రాస్తూ ట్రంప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నిర్వహించనున్న వైద్య పరీక్షల్లో మెంటల్ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ పరీక్ష లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆయనకు కేవలం దేహదారుఢ్య పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించింది.
ట్రంప్‌కు చేసే పరీక్షల్లో అది లేదు
Published Tue, Jan 9 2018 8:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment