వైఎస్‌ఆర్ పథకాలు నిర్వీర్యం
Published Mon, May 1 2017 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
– వైఎస్‌ఆర్‌సిపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
- కోవెలకుంట్లలో మెగా వైద్య శిబిరం
కోవెలకుంట్ల: వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో వైఎస్‌ఆర్ ఫౌండేషన్(అమెరికా), సీమాంధ్ర రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితోపాటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్లపుల్లయ్య, చిన్నబాబు, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్లు సురేంద్రనాథ్‌రెడ్డి, జ్యోతివాణి, జగన్‌మోహన్‌రెడ్డి, సిద్ధార్ధ, నాగరాఘవేంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివరామిరెడ్డి వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరు, కాటసాని, బుడ్డా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ పేదల ఆరోగ్యం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ, 104, 108, తదితర బృహత్తర పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకు పేర్లు మార్చి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వైఎస్సార్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు నాగేశ్వరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు మధుసూదన్‌రెడ్డి, తిరుపతయ్య, ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, సంఘం సుధాకర్‌రెడ్డి, ఎర్రం ఈశ్వరరెడ్డి, పల్లె మహేశ్వరరెడ్డి, నాగేంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement