gouru
-
పేర్లు మార్చడం తప్ప చేసిందేమీలేదు
- పథకాల అమలులో సర్కారుపై గౌరు దంపతులు - ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో విఫలమవుతున్నారని విమర్ష పాణ్యం: రాష్ట్రంలో టీడీపీ అధకారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గౌరు చరిత, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్షించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేరువ చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో గురువారం గౌరు దంపతులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మండల కన్వీనర్ పాలం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అవినీతి, అధికారులపై దాడులు, ఆ పార్టీ నాయకులకు దోచిపెట్టడం.. ఇదే టీడీపీ మూడేళ్ల ప్రణాళిక అని విమర్షించారు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అధికార పార్టీ నాయకులకు నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలకు తెలియజేసేందుకే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేట్టారని తెలిపారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మండలంలో గడపగడపకూ తిరిగి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. మొదటి రోజున ఎస్ కొత్తూరు, గగ్గటూరు, అనుపూరు, అహల్యాపురం గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. నీరున్నా వదలడం లేదు.. బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నా పాణ్యం ఎస్సార్బీసీ కాలనీకి సరఫరా చేయడం లేదని కాలనీకి చెందిన కొందరు అధికారులు ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తెచ్చారు. డీఈ విజయ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన చేందారు. ఇందుకు స్పందించిన ఎమ్యెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీటిని వదలాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్న సంజీవ, కౌలూరు సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు వెంగళరెడ్డి, నాగేశ్వరెడ్డి, సుబ్బారెడ్డి, అమరసింహరెడ్డి, శివారెడ్డి, ఇమాం, శ్రీనివాసులు, ఖాదర్, మిలటరి సుబ్బారెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ పథకాలు నిర్వీర్యం
– వైఎస్ఆర్సిపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి - కోవెలకుంట్లలో మెగా వైద్య శిబిరం కోవెలకుంట్ల: వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఫౌండేషన్(అమెరికా), సీమాంధ్ర రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారితోపాటు వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్లపుల్లయ్య, చిన్నబాబు, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్లు సురేంద్రనాథ్‌రెడ్డి, జ్యోతివాణి, జగన్మోహన్రెడ్డి, సిద్ధార్ధ, నాగరాఘవేంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివరామిరెడ్డి వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరు, కాటసాని, బుడ్డా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పేదల ఆరోగ్యం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ, 104, 108, తదితర బృహత్తర పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలకు పేర్లు మార్చి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం వైఎస్సార్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు నాగేశ్వరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు మధుసూదన్‌రెడ్డి, తిరుపతయ్య, ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, సంఘం సుధాకర్‌రెడ్డి, ఎర్రం ఈశ్వరరెడ్డి, పల్లె మహేశ్వరరెడ్డి, నాగేంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
గౌరును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
– డోన్ నియోజకవర్గ ఎంపీటీసీలు, కౌన్సిలర్ల మద్దతు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని డోన్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తెలిపారు. మంగళవారం ప్యాపిలి మండలంలోని జలదుర్గం, రాచెర్ల, ధర్మవరం, కొచ్చెర్వు ఎంపీటీసీలు సలాం, షేక్‌న్‌బీ, సాలన్న, పి.సులోచన, డోన్ మునిసిపాలిటీ 2, 12, 16వ వార్డుల కౌన్సిలర్లు ఆశాజ్యోతి, గోపాల్, రాజేశ్వరి తదితరులు కర్నూలులో గౌరు వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. వీరి వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారం సుబ్బారెడ్డి, నాయకులు చింతలపేట ఈశ్వరరెడ్డి, కన్నపుకుంట సర్పంచ్ మహేష్‌రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ సోమేష్, పెద్దనాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కోడుమూరు రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి.. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి లద్దగిరిలో కోట్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ హయాంలో రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఎల్ఎల్సీ, జీడీపీ ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ నది ఎండిపోయి పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టులో రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని.. మంత్రులు తమ స్వలాభం చూసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున బరిలోని గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
‘గౌరు’ను భారీ మెజార్టీతో గెలిపించండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పిట్టం ప్రతాపరెడ్డి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలను కోరారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌరు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడని, రైతుల కష్టనష్టాల గురించి తెలిసిన వ్యక్తిని అలాంటి వారిని గెలిపిస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లాకు చేసిందేమి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాట ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌర వెంకటరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
– అభ్యర్థుల పక్షాన విస్తృత ప్రచారం చేపట్టండి – గౌరు వెంకటరెడ్డి పిలుపు కల్లూరు: పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకుందామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని గౌరు వెంకటరెడ్డి స్వగృహంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పి.ఎల్ మధు ఆధ్వర్యంలో అభిమానులు ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ముందుగా పి. ఎల్. మధు, గౌరు వెంకటరెడ్డిని అభిమానులు పూలమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డాక్టర్ కేవీ సుబ్బారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లాలో ఎస్సీ సెల్‌ను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జార్జ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మీపురం పి. బతుకన్న, ప్రేమ్‌రాజ్, రాముడు, జయానందరాజు, యోహోస్వా, పీజీ శేఖర్, తడకనపల్లె మాజీ సర్పంచ్ మద్దిలేటి, ఏసన్న, పెద్దటేకూరు కె. మునిస్వామి, రమేష్, డేవిడ్, దస్తగిరి, పందిపాడు నాగమద్దిలేటి, చెట్లమల్లాపురం భగవాన్‌దాస్, దిన్నెదేవరపాడు వెంకటరాముడు, సుధాకర్, వామసముద్రం వెంకటేస్, మునిస్వామి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన 200 మంది అభిమానులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే
- ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్థానిక ప్రజాప్రతినిధులందరూ మాతోనే - టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి - వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్ఆర్సీసీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గౌరు నివాసంలో బీసీ సంఘాల నాయకులు దేవపూజ ధనుంజయాచారి, జలం శ్రీను, మద్దిలేటి తమ అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ గౌరు వెంకటరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టభద్రుల ఎన్నికల్లో గోపాల్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తాను తప్పక విజయం సాధిస్తానని, తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఇతరనాయకులు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లలేదన్నారు. వారందరూ తన విజయానికి కృషిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి తప్పుచేశామని పలువరు పశ్చాతాపం పడుతున్నారని, ఆ విషయాని స్వయంగా కొందరు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే తనకు చెప్పినట్లు వివరించారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తన గెలుపునకు సహకరిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలవుతుందన్నారు. ఏపీకి ప్రాణవాయువుగా భావించిన ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు వైఎస్ఆర్సీపీలో చేరినట్లు నాయకులు దేవపూజ ధనుంజయాచారి, జలం శ్రీను, మద్దిలేటి తెలిపారు. పార్టీ అప్పగించిన ఏబాధ్యతనైనాను సమర్థవంతగా నిర్వహించి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
గౌరు గెలుపునకు కృషి చేద్దాం
– ఐక్యంగా పనిచేస్తే అత్యధిక మెజార్టీతో విజయం – ఆలూరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన గౌరు వెంకటరెడ్డి – మొదటి సమావేశానికి విశేష స్పందన ఆలూరు రూరల్/ఆలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరు వెంకటరెడ్డి గెలుపుకు కృషి చేద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరువెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఎన్నికల ప్రచారాన్ని ఆలూరు నియోజకవర్గంలో ప్రారంభించారు. ప్రచారానికి హాజరైన గౌరు, బీవై రామయ్యకు స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, ఆస్పరి, హొళగుంద, చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లోని ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. దోచుకోవడమే టీడీపీ నేతల పని.. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల దోపిడీ పర్వానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్నారు. రోజురోజుకు వారి దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి గెలవడం కష్టమైనా బరిలో నిలిపారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఐక్యంగా ఉండి.. గౌరు వెంకటరెడ్డి విజయానికి కలిసిగట్టుగా కృషి చేయాలన్నారు. గౌరును గెలిపించి.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కర్నూలు జిల్లా తరఫున కానుకగా ఇద్దామన్నారు. గతంలో గౌరు వెంకటరెడ్డి నాయకత్వంలో జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. నిధులివ్వని ప్రభుత్వం... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీ సభ్యులకు నిధులు, అధికారాలను ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సర్పంచులతో సమానంగా ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించాలని ఎంపీటీసీల సంఘం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సభ్యులు తన విజయానికి సహకరించాలని కోరారు. రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కేవీ సుబ్బారెడ్డి విజయానికి కూడా వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి విభాగసంఘం నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఆలూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు, ఆస్పరి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, ఆస్పరి దత్తాత్రేయరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు చిన్నఈరన్న, దొరబాబు, భీమప్పచౌదరి, ఓబులేష్, లుముంబా, ఆయా మండల కో–కన్వీనర్లు కిట్టు, బాబాసాహెబ్, హŸళగుంద జెడ్పీటీసీ సభ్యురాలు గంగమ్మ, ఆమె భర్త అయ్యాళప్ప, హొళగుంద ఎంపీపీ మల్లి, పార్టీ ఆలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు బసప్ప, హర్ధగేరి శ్రీనివాసులు, కల్యాణ్‌గౌడ్, కేశవరెడ్డి, విక్రాంత్‌రెడ్డి, అరికెర వీరేష్, హనుమయ్య, గోవిందు, ఏరూరు శేఖర్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరు
– నేడు ఉదయం నామినేషన్ దాఖలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తన అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని రంగంలోకి దింపింది. మరో వైపు అధికార పార్టీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాలేదు. మరో సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని శిల్పా పట్టుపబడుతున్నారు. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార పార్టీలోని మరో వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే అధికార పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అవసరమైన మెజార్టీ వాస్తవానికి లేదు. అయినప్పటికీ అభ్యర్థులు బరిలో నిలపడం ద్వారా ఓటుకు నోటు వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 53 జెడ్పీసీటీ స్థానాలు ఉన్నాయి. ఇక ఎంపీటీసీల సంఖ్య 815 కాగా, ఇందులో 11 మంది లేరు. దీంతో ఎంపీటీసీల సంఖ్య 804గా ఉంది. మరో వైపు వివిధ మున్సిపాలిటీలను కౌన్సిలర్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఉంది. ఈ లెక్కన ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తరహాలో ఇక్కడ కూడా అభ్యర్థిని కొనుగోలు చేసి గెలవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పార్టీ తరఫున భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడవద్దని ఆ పార్టీ భావిస్తోంది. ఉదయం 10 గంటలకు నామినేషన్ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరి 10.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా జిల్లాలో పార్టీ సత్తా మరోసారి చాటాలని ఆ పార్టీ ఒక ప్రకటనలో కోరింది. -
పాదయాత్రగా మల్లన్న చెంతకు..
ఆత్మకూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఆయన సతీమణి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వీరి కుమారుడు గౌరు జనార్దన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నేత ప్రహ్లాదరెడ్డితో పాటు 200 మందికి పైగా కార్యకర్తలు శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరారు. శుక్రవారం నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని బైర్లూటి చెంచుగూడెం నుంచి అటవీ మార్గంలో నాగలూటి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ వెలసిన నాగలూటి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొంత సేపు సేద తీరారు. అనంతరం కాలినడక మెట్ల మార్గం వెంట పెచ్చెర్వుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా తాము కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వెళ్లి శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. అటవీ మార్గంలో భక్తులకు మంచినీరు, మెడికల్ క్యాంప్‌లు ఇంకా ఏర్పాటు చేయకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. సత్వరమే శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. గౌరు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకులు సత్యంరెడ్డి, రాజశేఖరరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, శివస్వాములు పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి – హోదా కోరుతూ విద్యార్థి విభాగం నిరాహార దీక్షలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. శనివారం స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హోదా సాధించేంత వరకు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నాయకులు, 15 ఏళ్లు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారన్నారు. అప్పటి మాటలను టీడీపీ, బీజీపీ నేతలు విస్మరించి హోదాతో ఒరిగేదేమీ లేదని మాట్లాడడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి..చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సొంత సంపాదన తప్ప.. రాష్ట్రం కోసం సీఎం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తెలుసుకుని విద్యార్థులు హోదా కోసం దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. పలువురి మద్దతు... రిలే దీక్షలకు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, యూత్ జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి నేతృత్వంలో యువజనులు, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రమణ నేతృత్వంలో కార్మికులు, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి నేతృత్వంలో మహిళలు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐదుకోట్ల ఆంధ్రులు హోదాను కోరుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సాయంత్రం 5.00 గంటలకు పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ..విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దీక్షల్లో కూర్చున్న వారు వీరే.. అనిల్, గోపి, సందీప్, లోకేశ్, ఆనంద్, భూపతి, షాలి, సతీశ్, ప్రదీప్, సతీష్, సునీల్, సంజు, వినోద్, భరత్, విక్రమ్, కుమార్, షాష, గోవింద్, పృధ్వీ, చంటి. సంఘీభావం.. ట్రైబల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, అంబేడ్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ దీక్షలకు సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో నగర నాయకులు ఈశ్వర్, మునాఫ్, అహ్మద్, బుజ్జి, సాంబ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.