ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే
Published Sun, Mar 5 2017 9:46 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- ఎమ్మెల్యేలు పార్టీ మారినా స్థానిక ప్రజాప్రతినిధులందరూ మాతోనే
- టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని వైఎస్‌ఆర్‌సీసీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గౌరు నివాసంలో బీసీ సంఘాల నాయకులు దేవపూజ ధనుంజయాచారి, జలం శ్రీను, మద్దిలేటి తమ అనుచరులతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ గౌరు వెంకటరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టభద్రుల ఎన్నికల్లో గోపాల్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తాను తప్పక విజయం సాధిస్తానని, తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఇతరనాయకులు వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లలేదన్నారు. వారందరూ తన విజయానికి కృషిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గతంలోనే శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి తప్పుచేశామని పలువరు పశ్చాతాపం పడుతున్నారని, ఆ విషయాని స్వయంగా కొందరు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే తనకు చెప్పినట్లు వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుపొందిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తన గెలుపునకు సహకరిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధి అధోగతి పాలవుతుందన్నారు. ఏపీకి ప్రాణవాయువుగా భావించిన ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు వైఎస్‌ఆర్‌సీపీలో చేరినట్లు నాయకులు దేవపూజ ధనుంజయాచారి, జలం శ్రీను, మద్దిలేటి తెలిపారు. పార్టీ అప్పగించిన ఏబాధ్యతనైనాను సమర్థవంతగా నిర్వహించి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Advertisement