గౌరును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం | gouru should won | Sakshi
Sakshi News home page

గౌరును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం

Published Wed, Mar 15 2017 12:36 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

gouru should won

– డోన్‌ నియోజకవర్గ ఎంపీటీసీలు, కౌన్సిలర్ల మద్దతు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని డోన్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తెలిపారు. మంగళవారం ప్యాపిలి మండలంలోని జలదుర్గం, రాచెర్ల, ధర్మవరం, కొచ్చెర్వు ఎంపీటీసీలు సలాం, షేక్‌న్‌బీ, సాలన్న, పి.సులోచన, డోన్‌ మునిసిపాలిటీ 2, 12, 16వ వార్డుల కౌన్సిలర్లు ఆశాజ్యోతి, గోపాల్, రాజేశ్వరి తదితరులు కర్నూలులో గౌరు వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. వీరి వెంట వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారం సుబ్బారెడ్డి, నాయకులు చింతలపేట ఈశ్వరరెడ్డి, కన్నపుకుంట సర్పంచ్‌ మహేష్‌రెడ్డి, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ సోమేష్, పెద్దనాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement