ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
Published Mon, Mar 6 2017 10:20 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
– అభ్యర్థుల పక్షాన విస్తృత ప్రచారం చేపట్టండి
– గౌరు వెంకటరెడ్డి పిలుపు
కల్లూరు: పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుందామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని గౌరు వెంకటరెడ్డి స్వగృహంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పి.ఎల్ మధు ఆధ్వర్యంలో అభిమానులు ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ముందుగా పి. ఎల్. మధు, గౌరు వెంకటరెడ్డిని అభిమానులు పూలమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న డాక్టర్ కేవీ సుబ్బారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లాలో ఎస్సీ సెల్‌ను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో జార్జ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మీపురం పి. బతుకన్న, ప్రేమ్‌రాజ్, రాముడు, జయానందరాజు, యోహోస్వా, పీజీ శేఖర్, తడకనపల్లె మాజీ సర్పంచ్ మద్దిలేటి, ఏసన్న, పెద్దటేకూరు కె. మునిస్వామి, రమేష్, డేవిడ్, దస్తగిరి, పందిపాడు నాగమద్దిలేటి, చెట్లమల్లాపురం భగవాన్‌దాస్, దిన్నెదేవరపాడు వెంకటరాముడు, సుధాకర్, వామసముద్రం వెంకటేస్, మునిస్వామి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన 200 మంది అభిమానులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement