పేర్లు మార్చడం తప్ప చేసిందేమీలేదు
పేర్లు మార్చడం తప్ప చేసిందేమీలేదు
Published Thu, Jun 29 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
- పథకాల అమలులో సర్కారుపై గౌరు దంపతులు
- ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో విఫలమవుతున్నారని విమర్ష
పాణ్యం: రాష్ట్రంలో టీడీపీ అధకారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గౌరు చరిత, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్షించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేరువ చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాణ్యంలోని పార్టీ కార్యాలయంలో గురువారం గౌరు దంపతులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
మండల కన్వీనర్ పాలం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అవినీతి, అధికారులపై దాడులు, ఆ పార్టీ నాయకులకు దోచిపెట్టడం.. ఇదే టీడీపీ మూడేళ్ల ప్రణాళిక అని విమర్షించారు. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన అధికార పార్టీ నాయకులకు నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలకు తెలియజేసేందుకే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని చేట్టారని తెలిపారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మండలంలో గడపగడపకూ తిరిగి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. మొదటి రోజున ఎస్ కొత్తూరు, గగ్గటూరు, అనుపూరు, అహల్యాపురం గ్రామాల్లో పర్యటిస్తామన్నారు.
నీరున్నా వదలడం లేదు..
బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నా పాణ్యం ఎస్సార్బీసీ కాలనీకి సరఫరా చేయడం లేదని కాలనీకి చెందిన కొందరు అధికారులు ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తెచ్చారు. డీఈ విజయ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన చేందారు. ఇందుకు స్పందించిన ఎమ్యెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీటిని వదలాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్న సంజీవ, కౌలూరు సర్పంచ్ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు వెంగళరెడ్డి, నాగేశ్వరెడ్డి, సుబ్బారెడ్డి, అమరసింహరెడ్డి, శివారెడ్డి, ఇమాం, శ్రీనివాసులు, ఖాదర్, మిలటరి సుబ్బారెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement