తాండూరు, న్యూస్‌లైన్: ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు తాండూరులోని ప్రభు త్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంట ర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యవిధా న పరిషత్ రాష్ట్ర కమిషనర్ స్వర్ణనాగార్జున వెల్లడించారు. శుక్రవారం ఆమె వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ లోక్‌నాయక్‌తో కలిసి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ట్రామాకేర్ సెంటర్‌తోపాటు ఆస్పత్రిలో పది పడకల సర్జికల్ ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు మందుల స్టోర్‌రూం, ఆపరేషన్ థియేటర్, సిక్ నియోనేటల్ కేర్ యూని ట్ తదితర విభాగాలను పరిశీలించారు. ఇన్‌పేషెంట్లకు అందించే భోజనం, కూరలను కమిషనర్ రుచి చూశారు. వంటల్లో ఉప్పు అధికంగా ఉందని ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు రోజూ పాలు, భోజనంలోకి మజ్జిగ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశించిన కొల తల ప్రకారం రుచికరమైన భోజనం అం దేలా చూడాలని ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ను ఆదేశించారు. మందుల స్టోర్ రూం రికార్డులను పరిశీలించి నిర్వహణ సరిగా లేదన్నారు. పలు విభాగాలను కమిషనర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
సర్జరీ, స్కానింగ్ సేవలు మెరుగుపడాలి
సర్జరీలు, స్కానింగ్ సేవలు మెరుగుపడాలని కమిషనర్ సూచించారు. 1,200 మేజర్ సర్జరీల లక్ష్యానికి 400 మాత్రమే పూర్తి చేశారని, స్కానింగ్‌లూ తక్కువే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్జరీలలక్ష్యం అధికంగా ఇచ్చారని సూప రింటెండెంట్ వెంకటరమణప్ప చెప్పగా లక్ష్యాన్ని తగ్గిస్తామన్నారు.
చిన్నారుల వైద్యసేవలపై ప్రత్యేక శ్రద్ధ
సిక్‌నియోనేటల్ కేర్ యూనిట్‌లో తక్కువ బరువు, ఇతర సమస్యలు ఉన్న చిన్నారులకు వైద్యం అందించడంలో శ్రద్ధ చూపాలని కమిషనర్ ఆదేశించారు. చికిత్స పొందుతున్న 13మంది చిన్నారులను పరిశీలించారు. వారికి అందించే సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఆస్పత్రికి నిధులు సమకూరుతాయన్నారు. ట్యూబెక్టమీ, కాన్పుల సేవలు బాగున్నాయని కమిషన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ సెంటర్ ఆధునికీరణకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఐదుగురే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని వైద్యులు జయప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలోనే బ్లడ్ బ్యాంక్..
ఆస్పత్రి తనిఖీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. లెసైన్స్ రాకపోవడమే బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటులో జాప్యానికి కారణమని, తాండూరు ఆస్పత్రిలో పనిచేయడానికిై వెద్యులు ఆసక్తిచూపడం లేదని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో జీతా లు తీసుకుంటూ ఇద్దరు వైద్యులు డిప్యూటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్న అంశాన్ని పరిశీలిస్తానన్నారు. స్థల సమస్య వల్ల 150 పడకల మాతాశిశు ఆస్పత్రి ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు.
తాండూరులో ‘ట్రామాకేర్’
Published Sat, Nov 9 2013 12:35 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
Advertisement
Advertisement