న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ చెర నుంచి మాతృ దేశంలో అడుగుపెట్టిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతున్నారు. కూలింగ్ డౌన్ విధానంలో భాగంగా ఆయన మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతులను అధికారులు సమీక్షిస్తున్నారు. అతనికి ఎంఆర్‌ఐ స్కాన్ చేపట్టిన వైద్యులు.. వెన్నుముక్క కింది భాగంలో గాయమైనట్టు గుర్తించారు. అలాగే అభినందన్ శరీరంలో ఎటాంటి బగ్స్‌ను వైద్యులు గుర్తించలేదు.
అతనికి మరో పది రోజుల పాటు మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. శనివారం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అభినందన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ చెరలో అనుభవాల్ని ఆయన మంత్రితో పంచుకున్నారు. అభినందన్‌కు ఆరోగ్య పరీక్షలు ముగిసిన తరువాత పాకిస్తాన్ నిర్భంధంలో ఎదుర్కొన్న పరిస్థితులపై అధికారులు ఆయనను విచారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment