
సామాన్య మహిళలను చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తలను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా క్రమం తప్పకుండా అందిస్తున్న ‘వైఎస్సార్ చేయూత’ పథకంతో లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ పథకం నిధులతో పాటు బ్యాంక్ రుణాలు అందించి ఇప్పటికే వ్యాపారవేత్తలుగా మారిన ఎందరో అక్కచెల్లెమ్మలు చేయూత పథకం కార్యక్రమాన్ని ఊరూవాడా పండగలా సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు.
నెల్లూరు (సెంట్రల్): రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. ప్రధానంగా అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలనే ఉద్దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అండగా ఉంటున్నారు. బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని చేపట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మహిళలు వ్యాపార వేత్తల నుంచి పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తున్నారు.
గత నెల 23 నుంచి సంబరాలు
గత నెల 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత సంబరాలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాల అభివృద్ధి కోసం తపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎదుగుతామని పలువురు మహిళలు ప్రతినపూనారు.
పాలాభిషేకాలు.. పుష్పాభిషేకాలు
వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో తమ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుతుందని, గత మూడేళ్లుగా వరుసగా నగదు ఇస్తుండడంతో సంతోషంగా ఉన్నామని పలువురు మహిళలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు, çపుష్పాభిషేకాలు చేస్తున్నారు.
1,23,838 మందికి లబ్ధి
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,23,838 మందికి లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.18,750 వంతున రూ.232.20 కోట్లను జమ చేశారు. వరుసగా మూడో ఏడాది క్రమం తప్పకుండా నగదు తమ ఖాతాల్లో ముఖ్యమంత్రి వేయడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకోలేమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment