పొదలకూరు(పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా): ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. వ్యవసా యానికి ఉచితంగా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి రైతులకు అండగా నిలిచారు.’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు విద్యుత్ సబ్‌స్టేషన్లో సర్వేపల్లి నియోజకవర్గ రైతులకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద గురువారం ఒకే పర్యాయం 55 ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను వైఎస్సార్ నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. 1.91 లక్షల మంది రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నామని, ఇందుకోసం రూ.70 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 476 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, 301 మందికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి, ఈఈ జయకష్ణారెడ్డి, డీఈ దొరస్వామిరెడ్డి, ఏఈ గోవర్ధన్‌గిరి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ నగేష్‌కుమారి, ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ చిట్టెమ్మ, నాయకులు పెదమల్లు రమణారెడ్డి, కోనం బ్రహ్మయ్య, వాకాటి శ్రీని వాసులురెడ్డి, ఎంపీటీసీలు జి.శ్రీనివాసులు, జి.లక్ష్మీకల్యాణి, ఎస్‌కే అంజాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment